News March 23, 2024

తీర్పు రిజర్వ్

image

కవిత ఈడీ కస్టడీ పొడిగింపు పిటిషన్‌పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. ఆమెను మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ వాదించింది. తన క్లయింట్‌కు బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు లాయర్ కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి కాసేపట్లో తీర్పు వెలువరించనున్నారు. అయితే కోర్టు రూమ్‌లోనే తన పిల్లలు, కుటుంబ సభ్యులను కలవడానికి కవితకు జడ్జి అనుమతి ఇచ్చారు.

Similar News

News January 30, 2026

రేపు కామారెడ్డికి హైకోర్టు న్యాయమూర్తి రాక

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళా భారతిలో శనివారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళలు, పిల్లల రక్షణ-సామాజిక బాధ్యత అనే అంశంపై సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోషి, జస్టిస్ నర్సింగ్ రావు హాజరుకానున్నట్లు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి శుక్రవారం తెలిపారు.

News January 30, 2026

గవర్నర్vsసర్కార్: ఆర్టికల్ 176(1) ఏం చెప్తోంది?

image

<<18904369>>తమిళనాడు<<>>, <<18917423>>కర్ణాటక<<>>, కేరళ గవర్నర్లు రవి, థావర్ చంద్, రాజేంద్రకు ఆయా ప్రభుత్వాల మధ్య వివాదం ముదిరింది. అసెంబ్లీ సమావేశాల్లో వారు ప్రభుత్వ ప్రసంగాలను బాయ్‌కాట్ చేయడం/సొంత వ్యాఖ్యలను జోడించారు. కేంద్రాన్ని విమర్శించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 176(1) ప్రకారం అసెంబ్లీ ప్రసంగాన్ని గవర్నర్ చదవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఈ వివాదంపై రాష్ట్రపతి ఎలా స్పందిస్తారో?

News January 30, 2026

30 ఏళ్లుగా మగాడిలా… ఆ తల్లి ఎందుకలా మారింది?

image

తూత్తుకుడి(TN)కి చెందిన పెచియమ్మాళ్(57) 30 ఏళ్లుగా పురుషుడిగా జీవిస్తోంది. దీని వెనుక కన్నీటి కథ ఉంది. పెళ్లి జరిగిన 15 రోజులకే భర్త చనిపోయాడు. గర్భంతో ఉన్నట్లు తర్వాత తెలిసింది. బిడ్డ కోసం, వేధింపులను తప్పించుకునేందుకు మగాడిగా మారింది. జుట్టు కత్తిరించుకుని, ముత్తుగా ఐడెంటిటీని మార్చుకుంది. ఏళ్లుగా ఎన్నో కష్టాలకోర్చి కూతురిని పెంచింది. ఇటీవల పెళ్లి చేసింది. ఇకపైనా ముత్తుగానే ఉంటానని అంటోంది.