News March 16, 2024

కవిత పిటిషన్‌పై తీర్పు రిజర్వు

image

కవిత రిమాండ్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసులో కవితను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ వాదించింది. ఆమెను కస్టడీకి అప్పగించాలని కోరింది. అయితే ఇప్పటికే న్యాయస్థానంలో తన పిటిషన్ విచారణలో ఉండగానే తనను అరెస్టు చేయడాన్ని ఆమె సవాల్ చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును సాయంత్రం గం.4:30కి రిజర్వు చేసింది.

Similar News

News February 3, 2026

OTR అప్‌డేట్‌ చేయకపోతే అవకాశం కోల్పోతారు!

image

TG: త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండటంతో TGPSC కీలక ప్రకటన చేసింది. కమిషన్‌లో నమోదైన 31.56 లక్షల మంది తప్పనిసరిగా తమ OTR (వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌) వివరాలను అప్‌డేట్‌ చేయాలని సూచించింది. వ్యక్తిగత సమాచారం, విద్యార్హతలు, తాజా ఫొటో, సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25 వరకు గడువు పొడిగించారు. అప్‌డేట్‌ చేయకపోతే భవిష్యత్‌ నియామకాలకు దరఖాస్తు చేసుకోలేరని హెచ్చరించింది.

News February 3, 2026

ఈ నెల 26 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

image

తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు FEB 26- MAR 2 వరకు జరగనున్నాయి. FEB 26న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి, FEB 27న రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి, 28న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, మార్చి 1, 2న మలయప్పస్వామి పుష్కరణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. FEB 26, 27న సహస్రదీపాలంకార సేవ, FEB 28, MAR 1, 2 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను TTD రద్దు చేసింది.

News February 3, 2026

పూజ గదిలో ఉండకూడని విగ్రహాలు

image

పూజ గదిలో నిలబడి ఉన్న లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడి విగ్రహాలు, ఉగ్ర రూప మూర్తులు ఉంచకూడదు. అలా ఉంటే సంపద నిలవదని అంటారు. ఎత్తుగా ఉండే విగ్రహాలు కూడా అరిష్టమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పెద్ద విగ్రహాల ఆకర్షణ శక్తిని ఇల్లు భరించలేదు కాబట్టి వాటిని గుడికే పరిమితం చేయాలంటున్నారు. మరణించిన వారి ఫొటోలు సైతం పూజా మందిరంలో పెట్టకూడదట. తద్వారా దైవాగ్రహానికి గురై శాంతి, ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.