News June 28, 2024
కేసీఆర్ పిటిషన్పై తీర్పు రిజర్వ్

TG: పవర్ కమిషన్ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈరోజు లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది. కాగా బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేసింది. దీన్ని రద్దు చేయాలంటూ కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు.
Similar News
News October 21, 2025
త్వరలో 6వేల పోలీసు ఉద్యోగాలకు పోస్టింగ్స్: మంత్రి

AP: పోలీసు అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. తమ ప్రభుత్వం 6వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిందని, వారికి త్వరలో పోస్టింగ్స్ ఇస్తామని వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో నియామకాలు జరగలేదని విమర్శించారు. మరోవైపు పోలీసు శాఖలో 11వేల ఖాళీలు ఉన్నాయని ఇదివరకే డీజీపీ ప్రకటించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.
News October 21, 2025
Asia cup ట్రోఫీ వివాదం.. ఏసీసీ కొత్త ప్రతిపాదన!

Asia cup ట్రోఫీని తమకు అందజేయాలని ACC చీఫ్ నఖ్వీకి <<18064371>>బీసీసీఐ మెయిల్<<>> పంపిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ తొలివారంలో ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమం దుబాయ్లో నిర్వహిస్తామని ACC ప్రతిపాదన చేసింది. ‘మీరు ట్రోఫీని కోరుకుంటే.. దాన్ని ఇచ్చేందుకు వేదిక ఏర్పాటు చేస్తాం’ అని చెప్పినట్లు సమాచారం. కానీ అందుకు BCCI సుముఖంగా లేదని, ICC మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని ACC వర్గాలు చెప్పాయి.
News October 21, 2025
దీపిక-రణ్వీర్ కూతురిని చూశారా?

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ కూతురు దువా ఫొటోను తొలిసారి షేర్ చేశారు. దీపావళి సందర్భంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో చూసిన అభిమానులు వారి కూతురు చాలా క్యూట్గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. దీపిక, రణ్వీర్ జంటకు 2018లో వివాహం జరగగా గతేడాది సెప్టెంబర్లో పాప జన్మించింది.