News May 19, 2024

న్యాయ వ్యవస్థను మాజీ సీజేఐ రమణ నాశనం చేశారు: నారాయణ

image

AP: కేంద్రంలో బీజేపీ ఓడిపోవడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్ ‌గేమ్ ఆడుతోందన్నారు. రాష్ట్ర ప్రజలకు మొదటి శత్రువు మోదీ అని విమర్శించారు. న్యాయవ్యవస్థను మాజీ సీజేఐ వెంకటరమణ, తెలుగు ప్రజలను వెంకయ్యనాయుడు నాశనం చేశారని దుయ్యబట్టారు. ఏపీలో ఎన్నికల హింసకు పోలీసుల వైఫల్యమే కారణమని ఆరోపించారు.

Similar News

News October 31, 2025

విశాఖపట్నం పోర్టులో 58 పోస్టులు

image

విశాఖపట్నం పోర్ట్ 58 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్/ డిప్లొమా అర్హతగల అభ్యర్థులు NOV 1 నుంచి 30 వరకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు 27, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు 31 ఉన్నాయి. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9వేలు, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.8వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: vpt.shipping.gov.in

News October 31, 2025

రూ.కోట్లు కుమ్మరించినా చుక్క వర్షం పడలేదు

image

కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్(కృత్రిమ వర్షం) ఫ్లాప్ అయింది. ఇప్పటివరకు 3 ట్రయల్స్ నిర్వహించగా చుక్క వర్షం కూడా కురవలేదు. ఒక్కో ట్రయల్‌కి రూ.35.67 లక్షల చొప్పున రూ.1.07 కోట్లు ఖర్చయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 9 ట్రయల్స్ కోసం ప్రభుత్వం రూ.3.21 కోట్లు కేటాయించింది. లో సక్సెస్ రేట్ ఉన్న ఈ విధానానికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలొస్తున్నాయి.

News October 31, 2025

వాడని సిమ్స్‌ను డియాక్టివేట్ చేయండిలా!

image

చాలామంది ప్రస్తుతం ఒక సిమ్ మాత్రమే వాడుతున్నా ఆధార్ కార్డుపై ఎక్కువ సిమ్స్ యాక్టివ్‌లో ఉంటున్నాయి. ఇలాంటి అనవసరమైన సిమ్ కార్డులను డియాక్టివేట్ చేయడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్‌పై ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకొని, వాటిని క్యాన్సిల్ చేసేందుకు ‘TAFCOP’ పోర్టల్‌ అందుబాటులో ఉంది. మొబైల్ నం. & ఆధార్‌తో లాగిన్ అయి సిమ్ వివరాలు తెలుసుకోవచ్చు. అనవసరమైన వాటి డియాక్టివేషన్‌కు రిక్వెస్ట్ చేయొచ్చు.