News June 29, 2024

న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాలి: మమత

image

సామాన్యులను రక్షించడం న్యాయవ్యవస్థ ప్రథమ బాధ్యతని, అదెప్పుడూ నిష్పక్షపాతంగా ఉండాలని బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాలో నేషనల్ జుడీషియల్ అకాడమీ సదస్సులో CJI జస్టిస్ చంద్రచూడ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ‘కోర్టు.. గుడి, చర్చి, మసీదు, గురుద్వార లాంటిది. న్యాయవ్యవస్థను మెరుగుపరచడానికి మేం రూ.1,000 కోట్లు ఖర్చు పెట్టాం. 88 ఫాస్ట్ ట్రాక్, 99 మానవ హక్కుల కోర్టులు ఏర్పాటుచేశాం’ అని ఆమె తెలిపారు.

Similar News

News September 20, 2024

హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం

image

TG: హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చేస్తున్న హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ‘మిగతా శాఖలకు ఉండే పూర్తి స్వేచ్ఛ హైడ్రాకూ వర్తిస్తుంది. దీనికి సంబంధించిన నిబంధనలు సడలించాం. అవసరమైన 169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని వివిధ శాఖల నుంచి డిప్యుటేషన్‌పై రప్పిస్తున్నాం’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

News September 20, 2024

ఇది ముంచిన ప్రభుత్వం: అంబటి

image

AP: కూటమి సర్కార్ 100 రోజుల పాలనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘వంద రోజుల పాలనలో ఏమున్నది గర్వకారణం. పథకాల ఎగవేతలు. పరపార్టీపై నిందలు. రెడ్ బుక్ పీడనలు. ఇది ముంచిన ప్రభుత్వం’ అని విమర్శించారు.

News September 20, 2024

తిరుమ‌ల ప్ర‌సాదం క‌ల్తీ వివాదం.. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

image

తిరుమ‌ల‌ ప్ర‌సాదం కల్తీ వివాదం నేపథ్యంలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం మేల్కొంది. హిందూ ధార్మిక వ్య‌వ‌హారాలు ప‌ర్య‌వేక్షించే ముజ్రాయ్ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో ఇక నుంచి పూజ‌ల‌కు, దీపాలకు, అన్న ప్ర‌సాదాల‌కు నందిని నెయ్యి మాత్ర‌మే వాడాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి రామ‌లింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని 1.80 లక్షల ఆలయాల్లో 35,500 ఆలయాలు ఈ శాఖ పరిధిలోకి వస్తాయి.