News September 16, 2024
అలాంటి వ్యాఖ్యలకు న్యాయవ్యవస్థ దూరంగా ఉండాలి: ఉపరాష్ట్రపతి

ప్రభుత్వ సంస్థలను నిరుత్సాహపరచడమే కాకుండా రాజకీయ చర్చను రేకెత్తించే ఎలాంటి వ్యాఖ్యానాలకైనా న్యాయవ్యవస్థ దూరంగా ఉండాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సూచించారు. చట్టబద్ధమైన పనితీరును అనుసరించే బలమైన, స్వతంత్ర సంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. CBI పంజరంలో చిలక అనే భావన లేకుండా ఉండాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ధన్ఖఢ్ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Similar News
News December 9, 2025
సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

AP: ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న ఈ ఏడాదిలోనే అత్యల్పంగా అల్లూరి(D) దళపతిగూడలో 3.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 3-4డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం వరకు అధిక పీడనం కొనసాగడం వల్ల గాలులు వీస్తున్నాయని, ఫలితంగా చలి పెరిగిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13వ తేదీ వరకు చలి కొనసాగుతుందని పేర్కొంది.
News December 9, 2025
గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.
News December 9, 2025
‘ద్వార లక్ష్మీ పూజ’ ఎలా చేయాలి?

ఉదయాన్నే లేచి గడపను శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. 3 వత్తుల దీపం, బెల్లం, అటుకులు, తాంబూలం నైవేద్యంగా పెట్టాలి. గణేషుడిని నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి. వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అష్టోత్తరాలు చదివి హారతి ఇవ్వాలి. దీపం కొండెక్కే వరకు ఉంచి, తర్వాత తొలగించాలి. పూజ పూర్తయ్యాక నిద్రపోవడం శుభకరం కాదు. పెళ్లికానివారు, ఇంటి, ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఈ పూజ చేయవచ్చు.


