News July 11, 2024

జులై 11: చరిత్రలో ఈరోజు

image

1877: హైదరాబాద్ ఇంజినీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జననం
1907: సినీ నటుడు సీఎస్ఆర్ ఆంజనేయులు జననం
1955: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవం
1964: సంగీత దర్శకుడు మణిశర్మ జననం
1987: 500 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా. (జనాభా దినోత్సవం మొదలు)
2007: సినీనటుడు ‘ముత్యాల ముగ్గు’ శ్రీధర్ మరణం
* తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవం

Similar News

News April 2, 2026

అనకాపల్లి జిల్లాలో ఎమ్మార్వోల డిప్యూటేషన్ పోస్టింగ్స్

image

అనకాపల్లి జిల్లాలో ఏడుగురు MROలను డిప్యూటేషన్‌పై నియమిస్తూ కలెక్టర్ విజయకృష్ణన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
➱రోలుగుంట MRO నాగమ్మ కలెక్టరేట్‌కు ➱నక్కపల్లి MRO శ్రీనుని అచ్యుతాపురం
➱సబ్బవరం MRO చిన్నికృష్ణని నక్కపల్లి ➱మునగపాక MRO సత్యనారాయణను రాంబిల్లి
➱రాంబిల్లి MRO శ్రీనివాసరావు కలెక్టరేట్‌కు ➱మునగపాక MROగా కలెక్టరేట్ నుంచి పీవీ రత్నం
➱అల్లూరి నుంచి అరుణచంద్రను సబ్బవరం MROగా నియమించారు.

News April 2, 2026

IIFCLలో 33 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. అప్లై చేశారా?

image

33 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (IIFCL), న్యూఢిల్లీ నోటిఫికేషన్ ఇచ్చింది. MBA/ PGDBMలో 60% మార్కులు సాధించిన వారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం నెలకు సుమారు రూ.లక్ష వరకు ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి 10.04.26 చివరి తేదీ. మరిన్ని వివరాలకు www.iifcl.in చూడండి.

News April 2, 2026

యుద్ధాలు: ఇండియా ఆయుధాలకు గిరాకీ

image

యుద్ధాల నేపథ్యంలో పలు దేశాలు భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆయుధ కొనుగోళ్లను పెంచుకుంటున్నాయి. ఈ తరుణంలో మన డిఫెన్స్ యంత్ర పరికరాలకు డిమాండ్ పెరుగుతోంది. 2025-26లో ₹38,424CR మేర ఇండియా డిఫెన్స్ ఎగుమతులు జరిగినట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఇది గత ఏడాదికన్నా 62%అధికం. 2021-22లో ఈ ఎగుమతి విలువ ₹12,814 CR మాత్రమే. మొత్తం ఎగుమతుల్లో 54.84% పబ్లిక్ సెక్టార్లో, 45.16% PVT సెక్టార్లో జరిగాయి.