News July 12, 2024

జులై 12: చరిత్రలో ఈరోజు

image

క్రీ.పూ 101/102: రోమన్ నియంత జూలియస్ సీజర్ జననం
1803: కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ మరణం
1906: తెలుగు కవి, పండితులు పువ్వాడ శేషగిరిరావు జననం
1923: తొలి తెలుగు విజ్ఞాన సర్వస్వ కర్త కొమర్రాజు వెంకట లక్ష్మణరావు మరణం
1961: పుణెలో వరద బీభత్సం, 2వేలమందికి పైగా మృతి
1982: నాబార్డు బ్యాంకు స్థాపన
1985: ఆధ్యాత్మికవేత్త జిల్లెళ్ళమూడి అమ్మ మరణం
2012: నటుడు దారాసింగ్ మరణం

Similar News

News January 19, 2025

ప్రజా ధనంతో ఫ్రెండ్‌కు పవన్ రిటర్న్ గిఫ్ట్: YCP

image

AP: ఏ అనుభవం ఉందని ఓర్వకల్లులో ఈ-మొబిలిటీ పార్కు కోసం పీపుల్ టెక్ సంస్థకు 1200 ఎకరాలు కేటాయించారని YCP ప్రశ్నిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ మిత్రుడు, వ్యాపార భాగస్వామి అయిన TG విశ్వ ప్రసాద్ కంపెనీ కావడం వల్లే ఈ ఒప్పందం జరిగిందని ఆరోపించింది. ఎన్నికల్లో ఆర్థికంగా సహకరించిన స్నేహితుడికి జనసేనాని ఇలా ప్రజా ధనంతో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ధ్వజమెత్తింది. కాగా ఈ పీపుల్ గ్రూప్ బ్యానర్ Bro మూవీ నిర్మించింది.

News January 19, 2025

ఈ-మొబిలిటీ పార్క్: YCP ప్రధాన ఆరోపణలివే..

image

– ఈ-బైక్స్ తయారీలో పీపుల్ టెక్‌కు అనుభవం లేదు
– బైక్స్ తయారీ కోసం భాగస్వామ్య కంపెనీని ఎంచుకోలేదని చెబుతూనే ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది
– రూ.2100 కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయి ఆ సంస్థకు లేదు
– పీపుల్ టెక్ సంస్థ పవన్ స్నేహితుడు టీజీ విశ్వప్రసాద్‌ది కావడం వల్లే ఎకరా రూ.కోటికి పైగా పలికే భూమిని రూ.15 లక్షల చొప్పున 1200 ఎకరాలు <<15197150>>అప్పగించే ప్రయత్నం<<>>
– భూముల దోపిడీకే ఓర్వకల్లు కారిడార్‌కు క్యాబినెట్ ఆమోదం

News January 19, 2025

ఓ పెళ్లి కాని ప్రసాదులూ..! ఇది చదవండి..!!

image

ప్రయత్నిస్తే ప్రధాని కావచ్చేమో, పెళ్లి మాత్రం ఈ జన్మకి డౌటే! ఇది ఈ మధ్య వింటున్న ఫన్ ఫ్యాక్ట్. మారిన పరిస్థితులు, అమ్మాయిల ఆలోచనా విధానం, కొన్ని కులాల్లో అమ్మాయిల కొరతతో చాలామందికి వివాహాలు జరగడం లేదు. వ్యవసాయం, కుల వృత్తులు చేస్తున్నా, ఊర్లలో ఉన్నా మ్యాచ్ రావట్లేదనేది మ్యారేజ్ బ్రోకర్స్ మాట. పెళ్లి ఖర్చు సహా అమ్మాయికి అన్నీ తామే చూసుకుంటామన్నా కొందరికి సెట్ కాట్లేదట. మీ పరిస్థితి కూడా ఇదేనా?