News July 13, 2024

జులై 13: చరిత్రలో ఈరోజు

image

1905: భూదానోద్యమంలో భూమిని దానం చేసిన మొదటి భూస్వామి వెదిరె రామచంద్రారెడ్డి జననం
1915: స్వాతంత్ర్య సమరయోధుడు గుత్తి రామకృష్ణ జననం
1964: మాజీ క్రికెటర్ ఉత్పల్ చటర్జీ జననం
1967: సినీ నటి సీత జననం
2004: గుమ్మడిదలలో తొలి గ్రామీణ సమాచార కేంద్రం ప్రారంభం
2013: తెలంగాణ పోరాట యోధుడు కోడి సర్వయ్య మరణం
2018: నేపథ్యగాయని కె. రాణి మరణం

Similar News

News December 9, 2025

పీకల్లోతు కష్టాల్లో భారత్

image

కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి T20లో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన IND మూడో బంతికే వైస్ కెప్టెన్ గిల్(4) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సూర్య కుమార్(12) కూడా ఎంగిడి బౌలింగ్‌లోనే గిల్ తరహాలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. అభిషేక్(17) దూకుడుకు బౌలర్ సిపామ్లా బ్రేకులేశారు. IND స్కోర్ 7 ఓవర్లలో 50/3.

News December 9, 2025

తెలంగాణకు పెట్టుబడుల ‘పవర్’

image

TG: గ్లోబల్ సమ్మిట్‌లో పవర్(విద్యుత్) సెక్టార్‌కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. మొత్తం రూ.3,24,698 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వీటి ద్వారా 1,40,500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో జెన్‌కో, రెడ్కో, సింగరేణి సంస్థలు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్నాయని వెల్లడించారు.

News December 9, 2025

శాంసన్‌కు మరోసారి అన్యాయం: ఫ్యాన్స్

image

SAతో తొలి T20లో సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై ఆయన ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి సంజూకి అన్యాయం జరిగిందని, ఫామ్‌‌లో లేని కొందరు ప్లేయర్లకు టీమ్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ చేస్తోందని SMలో పోస్టులు పెడుతున్నారు. SAతో గత T20 సిరీస్‌లో శాంసన్ 2 సెంచరీలు చేశారని, గిల్ కంటే సంజూ బ్యాటింగ్ Avg, SR మెరుగ్గా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. ప్లేయింగ్‌11లో ఉండేందుకు సంజూ అర్హుడని పేర్కొంటున్నారు.