News July 14, 2024

జులై 14: చరిత్రలో ఈరోజు

image

1893: స్వాతంత్య్ర సమరయోధుడు, కవి గరిమెళ్ల సత్యనారాయణ జననం
1954: సినీ నటుడు శరత్ కుమార్ జననం
1954: నటుడు, రచయిత తనికెళ్ల భరణి జననం
1959: ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు జననం
2015: సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్ మరణం

Similar News

News January 9, 2026

‘భూ భారతి’.. మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అక్రమాలు!

image

TG: ‘భూ భారతి’ పోర్టల్ ద్వారా కొందరు మీసేవ, స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో కొంత ప్రభుత్వానికి జమ చేసి మిగతా నగదును పర్సనల్ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తేల్చారు. జనగామలో ఒక్కరోజే ₹8L తేడాను గుర్తించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అవకతవకలు జరిగాయేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది.

News January 9, 2026

శరీరంలో సెలీనియం ఎక్కువైతే ఏమవుతుందంటే?

image

బ్రెజిల్ నట్స్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సెలీనియం టాక్సిసిటీ పెరిగిపోతుంది. వికారం, డయేరియా, అలసట, జుట్టు రాలడం, గోళ్లు పెళుసుగా మారడం, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో గుండె, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. కొందరిలో అధిక సెలీనియం తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది.

News January 9, 2026

రామునికి సాయం చేసినవి సామాన్య వానరాలు కాదు!

image

రాముడికి సాయపడిన వానరులు దేవతాంశ సంభూతులు. రావణ సంహారం కోసం విష్ణువు రాముడిగా అవతరించగా ఆయనకు తోడుగా ఉండమని బ్రహ్మ దేవతలను ఆదేశించాడు. ఇంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు, వాయుదేవుని అంశతో హనుమంతుడు, అగ్ని అంశతో నీలుడు జన్మించారు. అందుకే వారు పర్వతాలను పిండి చేయగల దేహబలాన్ని, వాయువేగాన్ని, అద్భుతమైన బుద్ధిబలాన్ని కలిగి ఉండి, రాముడి విజయానికి వెన్నెముకలా నిలిచారు.