News July 15, 2024
జులై 15: చరిత్రలో ఈరోజు

1895: స్వాతంత్య్ర సమరయోధురాలు చేబియ్యం సోదెమ్మ జననం
1902: ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు జననం
1909: ఫ్రీడమ్ ఫైటర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ జననం
1920: నటుడు, రచయిత డి.వి.నరసరాజు జననం
1972: సినీదర్శకుడు వి.ఎన్.ఆదిత్య జననం
* ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం
* నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డే
Similar News
News January 18, 2026
కడప: ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీనా.. ఫోన్ చేయండి.!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ఛార్జీలను విపరీతంగా పెంచాయి. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీనిపై రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఛార్జీలను వసూలు చేయాలని ట్రావెల్స్ యజమానులకు సూచించారు. ఎవరైన అధిక ఛార్జీలు వసూలు చేస్తే 9281607001 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
News January 18, 2026
నకిలీ మద్యం మరణాలకు CBN బాధ్యత వహిస్తారా: వైసీపీ

AP: నకిలీ మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణించారంటూ ప్రభుత్వంపై YCP మండిపడింది. వీరి చావులకు సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకుంటారా అని ‘ఎక్స్’లో ప్రశ్నించింది. అన్నమయ్య జిల్లాలో నిన్న సాయంత్రం ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం సేవించిన మణికుమార్, పుష్పరాజ్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించారని విమర్శించింది. ఎక్స్పైర్, నకిలీ మద్యం అమ్ముతూ TDP లిక్కర్ సిండికేట్ సొమ్ము చేసుకుంటోందని వైసీపీ ఆరోపించింది.
News January 18, 2026
పుష్ప-3 ఉంటుందా? ఉత్తి హైపేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ వేర్వేరు సినిమాలతో బిజీ అయ్యారు. దీంతో పుష్ప-3 ఉంటుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. కేవలం హైపేనా? అంటూ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ సుకుమార్ టీమ్ వాటిని కొట్టిపారేసింది. మూవీ కచ్చితంగా ఉంటుందని చెప్పింది. డైరెక్టర్, హీరో ఇతర ప్రాజెక్టుల్లో బిజీ అయినా.. టైమ్ దొరికినప్పుడల్లా కథ, స్క్రిప్ట్‌పైన వర్క్ చేస్తున్నట్లు చెప్పింది.


