News July 17, 2024
జులై 17: చరిత్రలో ఈరోజు

1941: తమిళ సినిమా దర్శకుడు పి.భారతీరాజా జననం
1949: నటుడు, కవి రంగనాథ్ జననం
1949: భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు మహ్మద్ హబీబ్ జననం
1989: వేదపండితుడు, పద్మభూషణ్ ఉప్పులూరి గణపతి శాస్త్రి మరణం
* అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
* ప్రపంచ ఎమోజీ దినోత్సవం
Similar News
News January 29, 2026
క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన చంద్రబాబు

క్యాన్సర్‌ను కట్టడి చేయడమే లక్ష్యంగా CM చంద్రబాబు AP క్యాన్సర్ అట్లాస్ విడుదల చేశారు. డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో కలిసి రూపొందించిన ఈ అట్లాస్ ద్వారా రాష్ట్రంలోని 2.9 కోట్ల మంది స్క్రీనింగ్ వివరాలను మ్యాపింగ్ చేశారు. దేశంలోనే తొలిసారి క్యాన్సర్‌ను Notifiable Diseaseగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 2030 నాటికి కేసులను తగ్గించడమే లక్ష్యంగా విలేజ్ లెవల్ నుంచే ట్రీట్‌మెంట్ అందేలా ప్లాన్ చేశారు.
News January 29, 2026
చిరుతతో పోరాడి కొడుకును కాపాడుకున్న వృద్ధుడు!

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో చిరుతతో పోరాడి కొడుకును కాపాడుకున్నాడో వ్యక్తి. బాబుభాయ్(60) ఇంట్లో కూర్చొని ఉండగా చిరుతపులి దాడి చేసింది. అక్కడే ఉన్న శార్దూల్(27) అరవడంతో అతడిపైకి దూకింది. దీంతో కొడుకును కాపాడుకునేందుకు బాబుభాయ్ కొడవలి, ఈటెతో చిరుతను కొట్టి చంపేశాడు. తర్వాత అటవీ అధికారులకు సమాచారమిచ్చాడు. ఈ ఘటనలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
News January 29, 2026
రాత్రి నానబెట్టి ఉదయం తింటే..

రోజువారీ ఆహారంలో పెసలు తప్పకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉండే పెసలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి.
*పీచు పదార్థం ఆకలిని నియంత్రించి బరువు తగ్గేలా చేస్తుంది.
*చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బీపీని కంట్రోల్ చేస్తుంది.
*గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గిపోతాయి.
**రాత్రి నానబెట్టి ఉదయం మొలకల రూపంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.


