News July 18, 2024

జూలై 18: చరిత్రలో ఈ రోజు

image

1918: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా జననం
1920: సినీ నటి నిర్మలమ్మ జననం
1961: తెలుగు కవి, రచయిత అందెశ్రీ జననం
1974: సినీ నటుడు ఎస్వీ రంగారావు మరణం
1976: తెలుగు సినీనటి సౌందర్య జననం
1982: హీరోయిన్ ప్రియాంక చోప్రా జననం
1996: భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన జననం
2012: బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నా మరణం
* వరల్డ్ లిజనింగ్ డే

Similar News

News February 7, 2026

FEB 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

image

TG: మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11న స్థానిక సెలవు ప్రకటించాలని SEC జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని తెలిపింది. ప్రైవేట్ పరిశ్రమలకూ సెలవు ఇవ్వాలని సూచించారు. ఓటర్లు ఎటువంటి ఆటంకం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు SEC వెల్లడించింది.

News February 7, 2026

పాక్‌కు వ్యాక్సిన్ కష్టాలు: భారత్‌తో పెట్టుకుంటే తప్పదు మరి!

image

భారత్‌తో సంబంధాలు చెడగొట్టుకుంటే ఎలా ఉంటుందో పాక్‌కు ఒక్కొక్కటిగా తెలిసొస్తోంది. 2025 మే నాటి సైనిక ఘర్షణల తర్వాత ఇండియా నుంచి వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడంతో ఆర్థికంగా భారం పడుతోందని స్వయంగా ఆ దేశ మంత్రి ముస్తఫా వెల్లడించారు. GAVI ద్వారా ఇండియా నుంచి తక్కువ ధరకే టీకాలు పొందిన పాక్ ఇప్పుడు ఏటా $400 మిలియన్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. సొంతంగా వ్యాక్సిన్లు తయారు చేసుకోవడం వారికి తప్పేటట్లులేదు.

News February 7, 2026

KCRపై చర్యలు తీసుకునే దమ్ము లేదా: కిషన్ రెడ్డి

image

TG: KCR అక్రమాలపై చర్యలు తీసుకునే దమ్ము లేకపోతే CM పదవికి రేవంత్ రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘KCRపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారో రేవంత్ చెప్పాలి. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత CMది కాదా? అధికారంలోకి వచ్చాక KCRకు చిప్పకూడు తినిపిస్తా, దోచుకున్న డబ్బంతా కక్కిస్తా అని అన్నారు. ఇప్పుడు ఆయనపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారు’ అని ప్రెస్‌మీట్‌లో విమర్శించారు.