News July 26, 2024

జులై 26: చరిత్రలో ఈరోజు

image

1915: స్వాతంత్ర్య యోధుడు ప్రగడ కోటయ్య జననం
1927: భారత మాజీ క్రికెటర్ గులాబ్‌రాయ్ రాంచంద్ జననం
1975: సంఘసంస్కర్త గోపరాజు రామచంద్రరావు మరణం
2011: సాహిత్య పరిశోధకుడు, నాటకకర్త కొర్లపాటి శ్రీరామమూర్తి మరణం
2020: తెలంగాణ స్వాతంత్ర్య యోధుడు గార్లపాటి రఘుపతిరెడ్డి మరణం
2021: దక్షిణ భారత సినీ నటి జయంతి మరణం
>>కార్గిల్ విజయ్ దివాస్

Similar News

News November 23, 2025

వేగంగా కోలుకుంటున్న శ్రేయస్

image

ఆసీస్‌తో ODI సిరీస్‌లో గాయపడిన శ్రేయస్ అయ్యర్ వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై PBKS కో ఓనర్ ప్రీతిజింటా అప్డేట్ ఇచ్చారు. ఆ జట్టు ప్లేయర్ శశాంక్ సింగ్ బర్త్‌డే పార్టీలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. శ్రేయస్ అద్భుతంగా రికవరీ అవుతూ బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా SAతో ODI సిరీస్‌కు అతను ఇప్పటికే దూరమయ్యారు. జనవరిలో NZతో జరిగే వన్డేలకు అందుబాటులోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

News November 23, 2025

సీట్స్ ఫుల్.. టికెట్స్ నిల్! తప్పదు చిల్లు..!!

image

AP: సంక్రాంతికి ఊరికి వెళ్దాం అనుకున్న వారికి ఈసారీ అధిక చెల్లింపు చిల్లు తప్పదేమో. పెద్ద పండుగకు ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాలకు వెళ్లే రైళ్లు, విమానాల్లో టికెట్స్ బుక్ అయ్యాయి. రెండు నెలల ముందే సీట్స్ నిండి వెయిటింగ్ లిస్ట్ వందల్లో కన్పిస్తోంది. దీంతో ప్రైవేటు ట్రావెల్స్ బుకింగ్స్ రేట్స్ ఇప్పట్నుంచే పెంచేస్తున్నాయి. ఇంకేముంది.. ఎప్పట్లాగే ఈసారీ ప్రైవేటును ఆశ్రయించి ఛార్జీ వేటుకు గురవక తప్పదు.

News November 23, 2025

పర్సనల్ లైఫ్ తప్ప పైరసీపై నోరుమెదపని iBOMMA రవి?

image

iBOMMA నిర్వాహకుడు రవి నాలుగో రోజు విచారణలో తన లైఫ్‌స్టైల్ గురించి పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ‘పైరసీతో వచ్చిన డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేశా. 15-20 రోజులకొకసారి విదేశాలకు వెళ్లాను. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, US, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, దుబాయ్ తదితర దేశాలు తిరిగాను’ అని చెప్పినట్లు తెలుస్తోంది. పర్సనల్ విషయాలు తప్ప పైరసీ నెట్‌వర్క్ గురించి నోరు తెరవలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.