News July 27, 2024

జులై 27: చరిత్రలో ఈరోజు

image

1911: స్వాతంత్ర్య సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి జననం
1955: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ అలెన్ బోర్డర్ జననం
1960: సినీ నటుడు సాయి కుమార్ జననం
1963: సింగర్ కేఎస్ చిత్ర జననం
1936: ఆధ్యాత్మికవేత్త అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి మరణం
1970: స్వాతంత్ర్య యోధుడు పీఏ థాను పిళ్లై మరణం
2015: భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణం

Similar News

News November 22, 2025

TU: పీజీ ఇంటిగ్రేటెడ్ రివాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోండి..!

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ ఇంటిగ్రేటెడ్( అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మస్యూటికల్) 2,4 సెమిస్టర్ల రెగ్యులర్ విద్యార్థులు తమ ఫలితాలపై రివాల్యుయేషన్ చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ తెలిపారు. ఈ మేరకు నిన్న సర్కులర్ జారీ చేశారు. ఈనెల 29లోపు రూ.500 రుసుము చెల్లించి పరీక్షల విభాగంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News November 22, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం 308 ఎకరాలు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం(ఎకరాకు రూ.20లక్షలు) అందజేయనుంది.
* రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల రక్షణకు కేంద్రం రూ.39.84 కోట్లను విడుదల చేసింది.
* అక్రమాస్తుల కేసులో APMSIDC జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెకు 27 చోట్ల స్థలాలు, ఇళ్లు, భూములు ఉన్నట్లు గుర్తించారు.

News November 22, 2025

భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.