News July 29, 2024
జులై 29: చరిత్రలో ఈరోజు

✒ 1883: ఇటలీ నియంత, ఫాసిస్టు పార్టీ ఫౌండర్ ముస్సోలినీ జననం
✒ 1891: విద్యావేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మరణం
✒ 1904: పారిశ్రామికవేత్త JRD టాటా జననం
✒ 1931: సాహితీవేత్త సింగిరెడ్డి నారాయణరెడ్డి జననం
✒ 2012: కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం మరణం
✒ అంతర్జాతీయ పులుల దినోత్సవం
Similar News
News November 23, 2025
మిద్దె తోటల్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

మిద్దె తోటల పెంపకంలో సేంద్రియ ఎరువులైన పేడ, వేప పిండి వాడితే మట్టిసారం పెరిగి కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ఎత్తుగా పెరిగే, కాండం అంత బలంగా లేని మొక్కలకు కర్రతో ఊతమివ్వాలి. తీగజాతి మొక్కల కోసం చిన్న పందిరిలా ఏర్పాటు చేసుకోవాలి. మట్టిలో తేమను బట్టి నీరివ్వాలి. * మొక్కలకు కనీసం 4 గంటలైనా ఎండ పడాలి. చీడపీడల నివారణకు లీటరు నీటిలో 5ml వేప నూనె వేసి బాగా కలిపి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయాలి.
News November 23, 2025
పోలీసులకు సవాల్ విసురుతున్న MovieRulz

పైరసీ మాఫియా టాలీవుడ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. iBOMMA, Bappam TV లాంటి సైట్లు బ్లాక్ చేసినా, MovieRulz మాత్రం తన దారులు మార్చుకుంటూ కొనసాగుతోంది. శుక్రవారం విడుదలైన సినిమాలు ఒక్కరోజు కూడా గడవక ముందే మూవీ రూల్జ్‌లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్లో కెమెరాతో రికార్డ్ చేసిన ప్రింట్లను అప్లోడ్ చేశారు. ఇప్పటికే iBOMMA రవిపై పోలీసులు విచారణను వేగవంతం చేసినప్పటికీ MovieRulz మాత్రం సవాల్ విసురుతోంది.
News November 23, 2025
నాగచైతన్య కొత్త మూవీ టైటిల్ వచ్చేసింది

అక్కినేని నాగచైతన్య, కార్తీక్ దండు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు రివీల్ చేశారు. ‘వృషకర్మ’ టైటిల్‌తో నాగచైతన్య యాంగ్రీ లుక్‌లో ఉన్న పోస్టర్‌ను Xలో పోస్ట్ చేశారు. చైతూకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ సాలిడ్‌గా ఉందని మహేశ్ పేర్కొన్నారు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్గా నటిస్తున్నారు.


