News July 31, 2024
జులై 31: చరిత్రలో ఈరోజు

✒ 1951: నటుడు శరత్ బాబు జననం.
✒ 1964: అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.
✒ 1980: ప్రముఖ సింగర్ మహమ్మద్ రఫీ మరణం.
✒ 1880: హిందీ, ఉర్దూ కవి ప్రేమ్చంద్ జననం.
✒ 2004: ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య మరణం.
✒ 2007: పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది.
Similar News
News December 16, 2025
దేవాలయాలకు వీటిని తీసుకెళ్తున్నారా?

గుడిలోకి ప్రవేశించేటప్పుడు తోలుతో చేసిన వస్తువులను ధరించడం, తీసుకువెళ్లడం శుభం కాదు. ఎందుకంటే తోలును చనిపోయిన జంతువుల నుంచి తయారు చేస్తారు. కాబట్టి అవి అపవిత్రమైన పదార్థాల కోవకు చెందుతాయి. పాదరక్షలు, బెల్టులు, పర్సులు వంటి తోలు వస్తువులతో ఆలయంలోకి వెళ్లడం దేవతలను అగౌరవపరచడం అవుతుంది. ఆలయ పరిశుద్ధత కాపాడటానికి భక్తులు ఆలయానికి ఇవేం తీసుకురాకుండా పరిశుభ్రమైన మనస్సుతో దేవుడిని దర్శించుకోవాలి.
News December 16, 2025
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ స్పష్టంగా ఉండాల్సిందే: NMC

డాక్టర్లు రాసే మందుల చీటీ మెడికల్ షాప్ వాళ్లకు తప్ప ఎవరికీ అర్థం కాదనే మాటలు వింటుంటాం. దీనికి చెక్ పెట్టేలా నేషనల్ మెడికల్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇకపై డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ను స్పష్టంగా, అర్థమయ్యేలా, క్యాపిటల్స్ లెటర్స్లో రాయాలని స్పష్టం చేసింది. ఇది కచ్చితంగా అమలయ్యేలా ప్రత్యేక కమిటీలు వేయాలని మెడికల్ కాలేజీలను ఆదేశించింది. ప్రిస్క్రిప్షన్ అర్థం కాకుండా రాయడం చట్టవిరుద్ధమని పేర్కొంది.
News December 16, 2025
‘అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా?

‘అఖండ-2’లో బాలకృష్ణ కూతురిగా నటించిన హర్షాలీ మల్హోత్రా గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. సినిమాలో ఆమె ఐక్యూ 226, 17 ఏళ్లకే DRDO సైంటిస్ట్ అని చూపించడంతో మీమ్స్ వస్తున్నాయి. ముంబైలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి నాలుగేళ్లకే సీరియళ్లలో, ఏడేళ్ల వయసులో సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ మూవీలో నటించి మెప్పించారు. 2017 తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. 8 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.


