News July 5, 2025
జులై 5: చరిత్రలో ఈరోజు

1906: నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య జననం
1927: రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జననం
1980: సినీ నటుడు కళ్యాణ్‌రామ్ జననం(ఫొటోలో)
1995: బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జననం(ఫొటోలో)
2017: సంఘసేవకురాలు కంచర్ల సుగుణమణి మరణం
అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం
Similar News
News July 5, 2025
ఉదయాన్నే ఫ్రీ మోషన్ అవ్వాలంటే..

చాలామంది ఉదయాన్నే మోషన్ అవ్వక అవస్థలు పడతారు. బలవంతంగా వెళ్లేందుకు కష్టపడుతుంటారు. అయితే పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు తాగితే కండరాలు వ్యాకోచించి ఫ్రీగా మోషన్ అవుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక నిత్యం జీర్ణక్రియ సక్రమంగా పనిచేయాలంటే ఫైబర్ అధికంగా ఉండే యాపిల్స్, క్యారెట్, దుంపలు, బఠానీ, బీన్స్, ఓట్స్ తీసుకోవడంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.
News July 5, 2025
9న క్యాబినెట్ సమావేశం

AP క్యాబినెట్ సమావేశం ఈ నెల 9న జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను జులై 7లోగా పంపాలని అన్ని శాఖలను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. అన్నదాత-సుఖీభవ, అమరావతిలో అభివృద్ధి పనులు, పోలవరం, విశాఖలో ఐటీ కంపెనీల ఏర్పాటు సహా పలు అంశాలపై చర్చించనున్నారు.
News July 5, 2025
నితిన్ ఖాతాలో మరో ప్లాప్?

నిన్న విడుదలైన ‘తమ్ముడు’ మూవీపై సినీ అభిమానులు, క్రిటిక్స్ పెదవి విరుస్తున్నారు. వరుస ప్లాప్‌ల తర్వాత కథ విషయంలో నితిన్ ఏమాత్రం జాగ్రత్త తీసుకోలేదని, మరో ఫెయిల్యూర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడని అంటున్నారు. డైరెక్టర్ వేణు ఏం చెప్పాలనుకున్నారో ఎవరికీ అర్థం కాలేదని, నిర్మాత దిల్ రాజు ఈ మూవీని ఎలా అంగీకరించారో ఆశ్చర్యంగా ఉందని SMలో కామెంట్స్ చేస్తున్నారు. మీరూ ఈ సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి.