News July 8, 2025

జులై 8: చరిత్రలో ఈరోజు

image

1497: భారత్‌కు వాస్కోడగామా ప్రయాణం ప్రారంభించిన రోజు
1914: బెంగాల్ దివంగత మాజీ సీఎం జ్యోతి బసు జననం
1919: తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు మరణం
1921: దివంగత పారిశ్రామిక వేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం
1949: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YS రాజశేఖర రెడ్డి జయంతి
1966: సినీ నటి రేవతి జననం
1972: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జననం
1978: తొలితరం భావకవి నాయని సుబ్బారావు మరణం

Similar News

News July 8, 2025

తెరుచుకోనున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు.. 25 ఏళ్లలో రికార్డు

image

AP: CM చంద్రబాబు ఇవాళ శ్రీశైలం క్రస్ట్‌గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేయనున్నారు. జులై తొలివారంలోనే డ్యామ్ గేట్లు ఎత్తడం పాతికేళ్లలో ఇదే తొలిసారి. డ్యామ్‌ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.80 TMCలు కాగా ప్రస్తుతం 193.4 TMCల నీరుంది. అటు సాగర్‌ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 312.05 TMCలు కాగా.. 164.1 టీఎంసీలున్నాయి. సాగర్‌కు 67,433 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

News July 8, 2025

రేపు కార్మిక సంఘాల భారత్ బంద్

image

కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ 10 కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఐక్యవేదిక రేపు (జులై 9) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బ్యాంకింగ్, పోస్టల్, ఇన్సూరెన్స్ వంటి రంగాలకు చెందినవారు బంద్‌లో పాల్గొననున్నారు. రైతులతో కలిపి 25 కోట్ల మంది పాల్గొంటారని ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత తెలిపారు. 10ఏళ్లుగా వార్షిక కార్మిక సమావేశం పెట్టకుండా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఆరోపించారు.

News July 8, 2025

గోదావరికి వరద ఉద్ధృతి

image

AP: శబరి, సీలేరు వరదతో గోదావరి నదిలో ప్రవాహం పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద 48 గేట్లు ఎత్తి 1.95 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. అటు ధవళేశ్వరం బ్యారేజీకి 2.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మహారాష్ట్రలో వర్షాలు మరింత ఊపందుకుంటాయని, 3-4 రోజుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.