News July 9, 2024

జులై 9: చరిత్రలో ఈరోజు

image

1875: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ స్థాపన
1926: దివంగత మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య జననం
1927: దివంగత నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జననం
1930: దివంగత దర్శకుడు కె. బాలచందర్ జననం
1949: అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆవిర్భావం
1958: ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జననం
1966: గాయకుడు ఉన్నికృష్ణన్ జననం
1969: ‘పులి’ భారత జాతీయ జంతువుగా ప్రకటన
1969: మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు జననం

Similar News

News April 25, 2025

BREAKING: తప్పిన రైలు ప్రమాదం

image

తమిళనాడులోని అరక్కోణంలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే పట్టాలపై దుండగులు బోల్టులు తప్పించారు. అధికారుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు, కేరళ వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.

News April 25, 2025

78వేల ఏళ్లైనా ఉగ్రవాదులు ఏం సాధించలేరు: గవాస్కర్

image

పహల్గామ్ ఉగ్రదాడిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఉగ్రవాదుల్ని, వారిని పెంచి పోషించేవారిని ఒకటే అడుగుతున్నా. గడచిన 78 ఏళ్లుగా మీ పోరాటం ఏం సాధించింది? ఒక్క మిల్లీమీటర్ భూమైనా దక్కిందా? ఇంకో 78వేల ఏళ్లైనా మీరు సాధించేదేమీ లేదు. ఏమీ మారదు. మరి ఎందుకీ హింస? చక్కగా శాంతియుతంగా జీవిద్దాం’ అని సూచించారు.

News April 25, 2025

GHMC: ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

image

హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు GHMC ప్రధాన కార్యాలయంలో కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ ఎన్నికలు ఈ నెల 23న జరిగాయి. 78.57 శాతం పోలింగ్ నమోదైంది. 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంకు చెందిన 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. BRS కార్పొరేటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

error: Content is protected !!