News June 9, 2024

మోదీ కెప్టెన్‌గా జంబో టీమ్

image

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్ కొలువుదీరింది. మోదీతో పాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 30 మందికి కేబినెట్ హోదా దక్కగా ఐదుగురు సహాయ(స్వతంత్ర), 36 మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. మోదీ టీమ్‌లో ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణకు చెందిన ఇద్దరికి ప్రాతినిధ్యం దక్కింది.

Similar News

News September 10, 2025

చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (A-38)కి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. గతంలోనూ చెవిరెడ్డి పిటిషన్ న్యాయస్థానం కొట్టేసింది. కాగా ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరైంది.

News September 10, 2025

62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది: ఉపరాష్ట్రపతి తల్లి

image

ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికవడం పట్ల ఆమె తల్లి జానకీ అమ్మాల్ హర్షం వ్యక్తం చేశారు. ‘నాకు కొడుకు పుట్టినప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన లాగే నేను కూడా టీచర్‌గా పనిచేశాను. ఆయన పేరునే నా కుమారుడికి పెట్టాను. ఏదో ఒక రోజు తను ప్రెసిడెంట్ అవ్వాలనే ఆ పేరు పెడుతున్నావా అని నా భర్త అడిగారు. 62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని ఆమె వ్యాఖ్యానించారు.

News September 10, 2025

సీమకు కరవును శాశ్వతంగా దూరం చేస్తాం: చంద్రబాబు

image

ఈ ఏడాది రాయలసీమలో తక్కువ వర్షపాతం నమోదైనా అన్ని చెరువులకు నీళ్లు వచ్చాయని CM చంద్రబాబు అనంతపురంలో చెప్పారు. ‘హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు TDP హయాంలోనే వచ్చాయి. డ్రిప్ ఇరిగేషన్, ప్రాజెక్టులతో ఎడారి నేలకు జీవం పోశాం. కియా కార్ల పరిశ్రమ తెచ్చాం. రూ.3,850 కోట్లతో హంద్రీనీవా ద్వారా కృష్ణమ్మను కుప్పం వరకు తీసుకెళ్లాం. సీమకు కరవును శాశ్వతంగా దూరం చేస్తాం. ఇది CBN మాట’ అని తెలిపారు.