News October 12, 2024
లుంగీలు, దుప్పట్ల సాయంతో జైలు నుంచి జంప్!

అస్సాంలోని మోరిగావ్ జిల్లా జైలు నుంచి శుక్రవారం రాత్రి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. లుంగీలు, దుప్పట్లను తాడులా చేసి 20 అడుగుల జైలు గోడను దూకేశారు. ఖైదీలు సైఫుద్దీన్, జియారుల్ ఇస్లాం, నూర్ ఇస్లాం, మఫీదుల్, అబ్దుల్ రషీద్ పోక్సో కేసుల్లో నేరస్థులని, వారి కోసం జిల్లావ్యాప్తంగా జల్లెడ పడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఖైదీలకు ఎవరైనా సాయం చేశారా అనే కోణంలోనూ విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 9, 2025
నువ్వుల విత్తనాలను వెదజల్లేకంటే విత్తడం మేలట

నువ్వుల పంట కోసం విత్తనాలను సాధారణంగా రైతులు వెదజల్లుతారు. అయితే విత్తనాన్ని వెదజల్లడం కంటే విత్తడం మేలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసల మధ్య 30సెం.మీ, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేటట్లు విత్తుకోవాలంటున్నారు నిపుణులు. విత్తనాలను వరుసలలో విత్తితే కలుపు తీసుకోవడానికి అనువుగా ఉండటమే కాకుండా మొక్కకు నీరు, పోషకాలు, సూర్యరశ్మి సమానంగా అంది కొమ్మలు బాగా వృద్ధి చెంది అధిక దిగుబడులు సాధించవచ్చు.
News December 9, 2025
మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.8,459 కోట్లు ఆదా: పొన్నం

TG: మహాలక్ష్మి పథకం ద్వారా RTCలో మహిళలకు ఉచిత ప్రయాణాలు మొదలై రెండేళ్లు పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండేళ్లలో మహిళలు 251 కోట్ల జీరో టికెట్ల ద్వారా రూ.8,459 కోట్లు ఆదా చేసినట్లు వెల్లడించారు. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా నిలిచిందని పేర్కొన్నారు.
News December 9, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.330 తగ్గి రూ.1,30,090కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.300 పతనమై రూ.1,19,250 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,99,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


