News March 21, 2024

IPLకు జంపా దూరం?

image

రేపటి నుంచి IPL ప్రారంభం కానుండగా రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడం జంపా టోర్నీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో జంపా దూరం కానున్నట్లు సమాచారం. రాజస్థాన్ తరఫున 20 మ్యాచులు ఆడిన అతడు.. 29 వికెట్లు పడగొట్టారు.

Similar News

News January 13, 2026

IPL 2026లో RCBకి కొత్త హోంగ్రౌండ్!

image

వచ్చే IPL సీజన్ కోసం RCBకి కొత్త హోంగ్రౌండ్స్ ఎంచుకుందన్న వార్తలు వైరలవుతున్నాయి. భద్రతా ప్రమాణాల దృష్ట్యా చిన్నస్వామి స్టేడియంలో RCB మ్యాచులు నిర్వహించేందుకు అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆడాల్సిన 7 హోంగ్రౌండ్ మ్యాచుల్లో 5 DY పాటిల్ స్టేడియం(నవీ ముంబై), 2 రాయ్‌పూర్‌లో ఆడుతుందని తెలుస్తోంది. RCB కప్పు కొట్టిందని చిన్నస్వామిలో నిర్వహించిన కార్యక్రమంలో 11మంది చనిపోయిన విషయం తెలిసిందే.

News January 13, 2026

శని త్రయోదశి ప్రత్యేక పూజ

image

శని త్రయోదశి శని దేవుని అనుగ్రహం పొందేందుకు అత్యంత విశిష్టమైన రోజు. ఏల్నాటి శని, అష్టమ శని ప్రభావంతో పనుల్లో ఆటంకాలు, కష్టాలు ఎదుర్కొంటున్న వారికి ఈ పూజ అమోఘమైన పరిష్కారం. శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ ఆరాధనతో శని దోషాలు తొలగి, శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పవిత్ర పర్వదినాన మీ పేరు, గోత్రంతో వేదమందిర్‌లో పూజ నిర్వహించుకుని శని దేవుని కృపకు పాత్రులు అవ్వండి. మీ పూజను ఇప్పుడే <>నమోదు చేసుకోండి<<>>.

News January 13, 2026

పిల్లలకు ఓదార్పునివ్వండిలా!

image

కొందరు పిల్లలు ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు ఉంటారు. పిల్లలు ఇలా ఉంటే వాళ్లను మార్చాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే. ఎందుకంటే పిల్లలు ఇలా చిన్నప్పటి నుంచి ఇలా ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతూ ఓదార్పునివ్వాలి. పిల్లలకి ఎందులో నైపుణ్యం ఉందో గుర్తించి, వాళ్ల అభిరుచులను తెలుసుకుని అందులో ఎదిగేలా సపోర్ట్ చేయండి. అప్పుడే పిల్లలు యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.