News August 22, 2025
గోడ దూకి పార్లమెంటు భవనంలోకి..

ఢిల్లీలోని పార్లమెంటు ప్రాంగణంలో సెక్యూరిటీ వైఫల్యం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గోడ దూకి పార్లమెంటు భవనంలోకి ప్రవేశించాడు. ఈ ఉదయం 6.30 గంటలకు ఈ ఘటన జరిగింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 22, 2025
ఈ నెల 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

AP: ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డులు ప్రింటింగ్ కార్యాలయాల నుంచి మండలాలకు చేరాయి. ఈ నెల 25 నుంచి కార్డుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు అందజేయనున్నారు. దీనిపై కార్డుదారు ఫొటో, కుటుంబసభ్యుల వివరాలు ఉంటాయి. కొత్తగా స్మార్ట్ ఈ-పోస్ మెషీన్లనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.
News August 22, 2025
బిహార్ ఓటరు జాబితాపై స్పందించిన సుప్రీంకోర్టు

బిహార్ ఓటరు జాబితా సవరణ వ్యవహారంపై రాజకీయ పార్టీల తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ అంశంపై పార్టీలు చొరవ చూపట్లేదని అభిప్రాయపడింది. అక్కడ 85వేల కొత్త ఓట్లు నమోదైతే రెండు అభ్యంతరాలు మాత్రమే వచ్చాయని తెలిపింది. ఓటు కోల్పోయిన ఓటర్లు ఫిర్యాదు చేయాలని సూచించింది. అటు ఓటర్ల ఆధార్‌ను గుర్తింపుగా అంగీకరించాలని ECని ఆదేశించింది. ఆధార్‌తో ఆన్‌లైన్లో ఓటు నమోదు చేసుకునేలా అవకాశం కల్పించాలని పేర్కొంది.
News August 22, 2025
అక్షయ్ కుమార్ హెల్త్ సీక్రెట్ ఇదే

బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ తన హెల్త్ సీక్రెట్‌ను రివీల్ చేశారు. రోజూ 6.30PMలోపు భోజనం చేస్తానని ఆయన తెలిపారు. అలాగే ప్రతి సోమవారం ఉపవాసం ఉంటానని, ఆదివారం సాయంత్రం భోజనం చేసిన తర్వాత మళ్లీ మంగళవారం ఉదయం తింటానని వెల్లడించారు. అయితే సూర్యాస్తమయానికి ముందే భోజనం చేస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుందని, జీవక్రియ పెరుగుతుందని, రక్తంలో చక్కెర స్థాయులు సమతుల్యమవుతాయని వైద్యులు చెబుతున్నారు.