News June 22, 2024

జూన్ 22: చరిత్రలో ఈరోజు

image

1932: సినీ నటుడు అమ్రీష్ పురి జననం
1945: నాటక, సినీ రచయిత గణేష్ పాత్రో జననం
1952: చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు చిలుకూరి నారాయణరావు మరణం
1972: తమిళ హీరో విజయ్ జననం
1974: నటి దేవయాని జననం
1994: తెలుగు సినీనిర్మాత, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ మరణం
2016: రంగస్థల, సినిమా నటుడు J.V.రమణమూర్తి మరణం
* వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే

Similar News

News November 1, 2025

‘గ్లోబల్ స్టార్’ కాదు ‘మెగా పవర్ స్టార్’

image

రాజమౌళి ‘RRR’ మూవీతో రామ్ చరణ్‌కు గ్లోబల్ స్టార్ ట్యాగ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్‌’లో అదే ట్యాగ్‌ను మేకర్స్ ఉపయోగించారు. అయితే తాజాగా పెద్ది సినిమా పోస్టర్‌లో మెగా పవర్ స్టార్ అని కనిపించడం టీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇది మంచి నిర్ణయమని కొందరు అంటున్నారు. ట్యాగ్‌లతో వారి స్టార్‌డమ్‌కు ఎలాంటి డ్యామేజ్ ఉండదని మరికొందరు చెబుతున్నారు. మీరేమంటారు?

News November 1, 2025

సూపర్ ఫామ్‌లో కివీస్.. వరుసగా 10 వన్డే సిరీస్‌లు కైవసం

image

ODI క్రికెట్‌లో న్యూజిలాండ్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తోంది. సొంతగడ్డపై 2019 నుంచి వరుసగా 10 ODI సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఇవాళ ENGపై మూడో వన్డేలో గెలిచి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి ఈ ఘనత సాధించింది. మెన్స్ ODI క్రికెట్‌లో ఇది సెకండ్ లాంగెస్ట్ విన్నింగ్ స్ట్రీక్. చివరగా IND చేతిలో ఓడిన కివీస్ ఆ తర్వాత దూసుకుపోతోంది. కాగా 2002-07 మధ్య వరుసగా 17 వన్డే సిరీస్‌లు గెలిచిన సౌతాఫ్రికా టాప్‌లో ఉంది.

News November 1, 2025

పాలపళ్లను శుభ్రం చేస్తున్నారా?

image

పాలపళ్లు ఊడిపోయేవే కదా అని చాలామంది పేరెంట్స్ వాటిపై శ్రద్ధ చూపరు. కానీ ఇవి నోటి నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ఇవి దవడ ఎముక వృద్ధి చెందటానికి మార్గం చూపించడంతో పాటు శాశ్వత దంతాలకు అవసరమైన చోటును కల్పిస్తాయి. అందుకే తొలి దంతం రావటానికి ముందు నుంచే శిశువుల నోటిని శుభ్రం చేయాలని చెబుతున్నారు. రోజుకు రెండుసార్లు బట్టతో లేదా మెత్తటి బ్రష్‌తో పళ్లను శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.