News June 26, 2024
జూన్ 26: చరిత్రలో ఈ రోజు

1980: దివంగత సినీనటుడు ఉదయ్ కిరణ్ జననం
1874: భారతదేశంలో రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహరాజ్ జననం
1838: నవలా రచయిత బంకించంద్ర ఛటర్జీ జననం
1993: టీమ్ ఇండియా క్రికెటర్ శివమ్ దూబే జననం
ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం
ప్రపంచ శీతలీకరణ దినోత్సవం
Similar News
News December 1, 2025
వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.
News December 1, 2025
CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
News December 1, 2025
₹50వేల కోట్ల దావా.. AERA పక్షాన కేంద్రం!

ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల ప్రైవేట్ ఆపరేటర్లు, ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) ఆఫ్ ఇండియా మధ్య ₹50వేల కోట్ల దావా SCకు చేరింది. ఇందులో కేంద్రం AERA పక్షాన నిలిచింది. రెగ్యులేటెడ్ సర్వీసెస్ కోసం కాలిక్యులేట్ చేసే అసెట్స్ క్యాపిటల్ వ్యాల్యూపై విభేదాలున్నాయి. ఆపరేటర్లు గెలిస్తే ఢిల్లీ ఎయిర్పోర్టులో యూజర్ డెవలప్మెంట్ ఫీజు ₹129 నుంచి ₹1261కి, ముంబైలో ₹175 నుంచి ₹3,856కు పెరుగుతుంది.


