News May 25, 2024
జూన్ 4 టెన్షన్.. ఏపీవ్యాప్తంగా తనిఖీలు

AP: ఓట్ల లెక్కింపు జరిగే జూన్4న అల్లరు చెలరేగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో ఏపీవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు సహా అనుమానిత ప్రదేశాల్లో కార్డెన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నారు. అక్రమ ఆయుధాలు, గుర్తింపు లేని వాహనాలు, పేలుడు పదార్థాలు వంటివి గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 24కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు.
Similar News
News December 12, 2025
కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. మిరపకు నల్ల తామర ముప్పు

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. దీని వల్ల మిరప పంటకు నల్ల తామర ముప్పు ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఈ పురుగులు మొక్క లేత ఆకులు, మొగ్గలు, పూలు, లేత కాయల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దీంతో ఆకులు, కాయలు రాలిపోతాయి. మొక్క పెరుగుదల ఆగి క్రమంగా చనిపోతుంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు పురుగుల వృద్ధి ఎక్కువ. ఆకు ముడత వ్యాప్తికి నల్ల తామర పురుగులు వాహకాలుగా పనిచేస్తాయి.
News December 12, 2025
ఐరాస అత్యున్నత పురస్కారం అందుకున్న IAS అధికారిణి సుప్రియా సాహూ

తమిళనాడు పర్యావరణం, వాతావరణ మార్పులు, అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహూ ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారమైన ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ 2025’ అవార్డు అందుకున్నారు. తమిళనాడులో ఉష్ణోగ్రతలు తగ్గించే పద్ధతులు ప్రవేశపెట్టడం, అటవీప్రాంత విస్తరణ, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలతో పాటు బ్లూ మౌంటెయిన్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మౌంటెయిన్స్ 2002 వంటివి ఆమె చేపట్టారు.
News December 12, 2025
తారస్థాయికి కూటమి అరాచక పాలన: అనిల్

AP: పోలీసులను అడ్డుపెట్టుకుని TDP రాజకీయాలు చేస్తోందని మాజీమంత్రి అనిల్ కుమార్ ప్రెస్ మీట్‌లో ఆరోపించారు. ‘కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారస్థాయికి చేరింది. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. మా పార్టీతో సంబంధంలేని మేయర్‌పై అవిశ్వాసం పెట్టి YSRCPపై ట్రోల్స్ చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండి.. సంఖ్యా బలమున్నా క్యాంపు రాజకీయాలు చేస్తోంది’ అని విమర్శించారు.


