News June 6, 2024
జూన్ 6: చరిత్రలో ఈరోజు

1877: మలయాళ కవి ఉళ్లూర్ పరమేశ్వర అయ్యర్ జననం
1890: అస్సాం తొలి సీఎం గోపినాథ్ బొర్దొలాయి జననం
1915: కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు జననం
1926: రచయిత, కవి గోపగారి రాములు జననం
1929: సినీ నటుడు, రాజకీయవేత్త సునీల్ దత్ జననం
1936: సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు జననం
1947: హాస్యనటుడు సుత్తి వీరభద్రరావు జననం
2015: సినీనటి ఆర్తీ అగర్వాల్ మరణం
Similar News
News December 4, 2025
నెల్లూరులో 5,198 మైక్రో ఎంటర్ప్రైజెస్ నమోదు..!

లోక్ సభలో నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి AP, నెల్లూరులో SHG కింద ఉన్న మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌పై ప్రశ్నించారు. MSME పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరండ్లాజే మాట్లాడుతూ.. MSME పరిశ్రమల రిజిస్ట్రేషన్‌కు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను 1జులై2020న ప్రారంభించామన్నారు. అప్పటి నుంచి మైక్రో ఎంటర్ ప్రైజెస్ 30 నవంబర్ 2025 నాటికి APలో SHGల తరఫున 1,30,171, నెల్లూరులో 5,198 నమోదయ్యాయన్నారు.
News December 4, 2025
గోల్డ్ లోన్? పర్సనల్ లోన్? ఏది బెటర్

మీ దగ్గర బంగారం ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవడం గుడ్ ఛాయిస్. అత్యవసరంగా డబ్బులు అవసరమైతే బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. తనఖా పెట్టిన కొద్దిసేపటికే డబ్బులు అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. నెల నెలా వడ్డీ కట్టే సమస్య ఉండదు. సంవత్సరం చివరిలో లేదంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చెల్లించి మీ బంగారం వెనక్కి తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ EMI చెల్లింపు మిస్ అయితే వడ్డీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.
News December 4, 2025
రష్యాకు ఫుడ్.. మనకు ఆయిల్!

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ముడిచమురు దిగుమతిదారు భారత్. ఉక్రెయిన్‌తో యుద్ధం తర్వాత రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశం నుంచి ఆయిల్‌ను IND అతితక్కువ ధరకే కొనుగోలు చేస్తోంది. ఈ డీల్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లేందుకు పుతిన్ పర్యటనలో ఒప్పందం కుదరనుంది. ‘ఫుడ్ ఫర్ ఆయిల్’ డీల్ $60 బిలియన్లకు పెరగనుంది. దీని ప్రకారం భారత్ వ్యవసాయ ఉత్పత్తులను రష్యాకు ఎగుమతి చేస్తే.. ఆ దేశం ఆయిల్‌ను పంపనుంది.


