News December 19, 2024

హైస్కూల్ ప్లస్‌ల స్థానంలో జూనియర్ కాలేజీలు

image

AP: గత ప్రభుత్వం తీసుకొచ్చిన హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేసి వాటి స్థానంలో జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. వీటిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కో-ఎడ్యుకేషన్ విధానం అమలు చేయనుంది. ప్రస్తుతం 475 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున జూ.కాలేజీలు ఉన్నాయి. మిగిలిన 190 మండలాల్లో కొత్త కాలేజీలను ఏర్పాటు చేస్తారు. కొత్తగా తీసుకునే కాంట్రాక్టు లెక్చరర్లను వీటిలో నియమించనున్నట్లు సమాచారం.

Similar News

News January 13, 2026

తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

<>తమిళనాడు <<>>మర్కంటైల్ బ్యాంక్‌ లిమిటెడ్ 20 బ్రాంచ్ హెడ్ (మేనేజర్, సీనియర్ మేనేజర్, AVP) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 30 నుంచి 45ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.ib.tmbonline.bank.in

News January 13, 2026

కవిత కాంగ్రెస్‌లో చేరడం లేదు: పీసీసీ చీఫ్

image

TG: జాగృతి చీఫ్ కవిత కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారంలో వాస్తవం లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కూతురుగా ఆమె చేస్తున్న విమర్శలపై BRS స్పందించాలన్నారు. మహిళా అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రుల శాఖల విషయంలో సీఎం జోక్యం లేదని, అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చారని మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.

News January 13, 2026

కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన చద్దా

image

క్విక్ కామర్స్ సంస్థల ‘10 నిమిషాల డెలివరీ’ విధానాన్ని కేంద్రం <<18845524>>తొలగించడంపై<<>> ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సంతోషం వ్యక్తం చేశారు. ‘సత్యమేవ జయతే.. అంతా కలిస్తేనే ఈ విజయం సాధ్యమైంది’ అంటూ X వేదికగా ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది డెలివరీ బాయ్స్‌పై ఉండే ఒత్తిడిని తగ్గిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పార్లమెంటులో కూడా గిగ్ వర్కర్ల భద్రతపై ఆయన <<18483406>>గళమెత్తి<<>> వారికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.