News January 25, 2025

బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు

image

నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించడంపై జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ‘పద్మ భూషణ్ పురస్కారం లభించినందుకు కంగ్రాట్స్ బాలా బాబాయ్. సినీ పరిశ్రమకు, ప్రజా సేవకు మీరు చేసిన అసమానమైన సేవలకు నిదర్శనంగా ఈ గుర్తింపు దక్కింది’ అని తారక్ కొనియాడారు.

Similar News

News January 15, 2026

‘జన నాయగన్’ విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ

image

విజయ్ దళపతి నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు సూచించింది. గతంలో U/A సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. అయితే, CBFC సర్టిఫికెట్ క్లియరెన్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతలు SCని ఆశ్రయించారు.

News January 15, 2026

మనీ ప్లాంట్ త్వరగా పెరగాలంటే?

image

* మనీ ప్లాంట్ పెంచే నీళ్లలో కొద్దిగా శీతల పానీయాలు పోస్తే ప్లాంట్ త్వరగా పెరుగుతుంది. * వంటింట్లో నాలుగు మూలలు బోరిక్ యాసిడ్ పౌడర్‌ చల్లితే దోమల బెడద తగ్గుతుంది. * కళ్లజోడు అద్దాలకు టూత్ పేస్ట్ రాసి టిష్యూ పేపర్‌తో శుభ్రం చేస్తే జిడ్డు పోతుంది. * అన్నం విడివిడిగా రావాలంటే ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్ కనోలా ఆయిల్ వేయాలి. * చపాతీలను బియ్యప్పిండితో వత్తితే మృదువుగా వస్తాయి.

News January 15, 2026

పిండివంటలతో ఇంటింటా ఘుమఘుమలు

image

సంక్రాంతి పండుగ అనగానే కోడి పందేలు, గొబ్బెమ్మలతో పాటు ఘుమఘుమలాడే పిండివంటలు గుర్తొస్తాయి. సొంతూళ్లకు వచ్చిన పిల్లలు, అల్లుళ్లు, మనవళ్ల కోసం ఇళ్లలో అరిసెలు, సకినాలు, మురుకులు, గారెలు, సున్నుండలు వంటి వంటకాలను తయారు చేస్తారు. బెల్లం, నువ్వులు, బియ్యం పిండితో చేసిన తీపి వంటకాలతో పాటు కారపూస, చెక్కలు వంటి కారం వంటకాలు కూడా తప్పకుండా ఉంటాయి. ఇంతకీ మీకు నచ్చిన పిండి వంటకం ఏంటి. COMMENT చేయండి.