News March 18, 2024
జూనియర్ NTR కొత్త లుక్

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతోంది. ‘దేవర’ సినిమా షూటింగ్ కోసం ఆయన తన ఫిట్నెస్ ట్రైనర్తో కలిసి గోవాకు బయలుదేరారు. విమానంలో టీషర్ట్, జీన్స్లో తారక్ సూపర్ స్టైలిష్గా కనిపించారు. గోవాలో 10 రోజుల పాటు చిత్రీకరణ ఉండే అవకాశం ఉంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి కొరటాల డైరక్టర్. ఈ సినిమా అక్టోబర్ 10, 2024న థియేటర్లలో విడుదల కానుంది.
Similar News
News November 7, 2025
జ్ఞానాన్ని అందించే గురువే విష్ణు దేవుడు

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిస్ఠాయ నమో నమః ||
ఈ శ్లోకం విష్ణు స్వరూపుడైన వేదవ్యాస మహర్షికి, జ్ఞానానికి నిలయమైన విష్ణుమూర్తికి నమస్కారాలు తెలియజేస్తుంది. మన జీవితంలో జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని అందించే గురువును విష్ణువుగా భావించి, గౌరవించాలి. అంకితభావంతో చదివితేనే ఉన్నతమైన వివేకం లభిస్తుందని దీని సారాంశం.
<<-se>>#VISHNUSAHASRASASOURABHAM<<>>
News November 7, 2025
విడుదలకు సిద్ధమవుతున్న వరి రకాలు

☛ M.T.U.1282: దీని పంటకాలం 120-125 రోజులు. మధ్యస్త సన్నగింజ రకం. చేనుపై పడిపోదు, అగ్గి తెగులును తట్టుకుంటుంది. గింజ రాలిక తక్కువ. దిగుబడి ఎకరాకు 2.8-3టన్నులు.
☛ M.T.U.1290: పంటకాలం 117-120 రోజులు. సన్నగింజ రకం. చేనుపై పడిపోదు. అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. చౌడునేలలకు అత్యంత అనుకూలం. సాధారణ భూమిలో ఎకరాకు 3 టన్నులు, చౌడు నేలల్లో ఎకరాకు 2-2.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఎగుమతులకు అనుకూలం.
News November 7, 2025
అమరావతి సిగలో మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్

ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అమరావతిలో భారీ క్వాంటమ్ కంప్యూటర్(1,200 క్యూబిట్ సామర్థ్యం)ను ఏర్పాటు చేయనుంది. రూ.1,772 కోట్ల పెట్టుబడికి సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం 4వేల చ.అ. విస్తీర్ణంలో భవనం అవసరముంటుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే IBM 133 క్యూబిట్, జపాన్కు చెందిన ఫుజిసు 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.


