News August 26, 2024
అత్యాచారం అంటే ఏంటని అడిగిన 2 రోజులకే..

అస్సాంలో మైనర్ బాలిక అత్యాచార ఘటనలో కలచివేసే విషయం వెలుగులోకి వచ్చింది. తనపై అఘాయిత్యానికి 2 రోజుల ముందే కోల్‌కతా హత్యాచార ఘటనను పేపర్లో చదివిన ఆమె అత్యాచారం అంటే ఏంటని తన బంధువును అడిగిందట. తర్వాత ఆ బాలిక లైంగిక దాడికి గురైంది. ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న ఆమెను ముగ్గురు వ్యక్తులు చెరువు వద్దకు లాక్కెళ్లి రేప్ చేశారు. విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడు చెరువులో దూకి <<13929006>>ఆత్మహత్య<<>> చేసుకున్నాడు.
Similar News
News November 27, 2025
వరంగల్: 30 ఏళ్ల నాటి స్నేహం.. చివరి శ్వాస వరకూ అంతిమ ప్రయాణం!

ఐనవోలు-వెంకటాపురం రోడ్డుపై <<18400053>>బుధవారం రాత్రి జరిగిన<<>> ప్రమాదంలో ఉడుతగూడెంకు చెందిన వెంకట్‌రెడ్డి(65), ఒంటిమామిడిపల్లికి చెందిన మహ్మద్ యాకూబ్ అలియాస్ చిన్న యాకూబ్(65) అక్కడికక్కడే మృతి చెందారు. ముప్పై ఏళ్లుగా విడదీయరాని ఈ స్నేహితులు రాంపూర్‌లో ఐరన్ రేకులు కొనుగోలు చేసుకుని ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మరణంలోనూ స్నేహితులు కలిసి వెళ్లిపోవడంతో గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.
News November 27, 2025
ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు: పాక్ రక్షణ మంత్రి

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలులో ఆరోగ్యంగా ఉన్నారని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. జైలులో 5స్టార్ హోటల్ కంటే మెరుగైన ఫుడ్ అందుతోందని, టీవీ చూసేందుకు, వ్యాయామానికి అనుమతిచ్చినట్టు చెప్పారు. నేడు, డిసెంబర్ 2న ఆయనను కలిసేందుకు కుటుంబసభ్యులకు జైలు అధికారులు అనుమతిచ్చారు. ఇమ్రాన్‌ను మరో జైలుకు తరలించారనే వార్తలను తోసిపుచ్చారు. రావల్పిండి జైలు దగ్గర ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళన విరమించారు.
News November 27, 2025
మిరపలో బూడిద తెగులు – నివారణ

మిరపను నవంబర్ నుంచి జనవరి వరకు బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. తెల్లని పొడి పూత ఎక్కువగా ఆకుల దిగువ భాగంలో కనిపిస్తుంది. ఆకుల పై భాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ఆకులు ఎండి రాలిపోతాయి. తెగులు సోకిన ఆకుభాగం గోధుమ రంగులోకి మారుతుంది. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో అజోక్సిస్ట్రోబిన్ 23% SC 200ml లేదా టెబుకొనజోల్25% WG 300 గ్రా. లేదా సల్ఫర్ 80% WP 800 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


