News June 18, 2024

సామాన్య ప్రయాణికుల గురించి పట్టించుకోవట్లే: సుధాంశు

image

సామాన్య ప్రయాణికుల అవసరాలను పక్కనపెట్టి, గత కొన్నేళ్లుగా వందేభారత్‌పైనే ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని ఆ రైలు సూత్రధారి సుధాంశు మణి అన్నారు. AC కోచ్‌ల తయారీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో NON AC కోచ్‌లు తగ్గాయని తెలిపారు. దీంతో రిజర్వేషన్ చేయించని ప్రయాణికులు సైతం AC కోచ్‌లలోకి ప్రవేశిస్తున్న ఘటనలు కనిపిస్తున్నాయని మండిపడ్డారు. మణి రైల్వేలో మెకానికల్ ఇంజినీర్‌గా 38 ఏళ్లుగా సేవలందించారు.

Similar News

News October 7, 2024

అద్భుతమైన ఫొటోలు

image

చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన ఎయిర్ షోకు లక్షలాదిగా జనం తరలివచ్చిన విషయం తెలిసిందే. ఎయిర్ షోలో ఆకాశం మీద నుంచి జెట్ విమానాలను తీసిన ఫొటోలు తాజాగా వైరలవుతున్నాయి. సముద్రం, పక్కనే చెపాక్ క్రికెట్ స్టేడియం, పొగలు కక్కుతూ దూసుకెళ్తోన్న జెట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల్లో చెన్నై అందాలు కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఎయిర్ షోకు భారీగా జనం పోటెత్తడంతో ఐదుగురు మరణించారు.

News October 7, 2024

నాలుగు నెలల్లో స్టార్ హీరో సినిమా పూర్తి!

image

తమిళ స్టార్ హీరో సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబోలో రాబోతున్న ‘SURIYA44’ షూటింగ్ పూర్తయింది. కేవలం నాలుగు నెలల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది మార్చి 28న ఈ సినిమాను అనౌన్స్ చేయగా జూన్ 2న షూటింగ్ ప్రారంభించారు. నిన్న షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది డైరెక్టర్లు కార్తీక్‌ను చూసి నేర్చుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

News October 7, 2024

అంతకు మించి ఏర్పాట్లు చేశాం: స‌్టాలిన్‌

image

చెన్నై మెరీనా బీచ్‌లో ఎయిర్ షో నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఎయిర్ ఫోర్స్ కోరిన ఏర్పాట్ల‌కు మించి వ‌స‌తులు క‌ల్పించిన‌ట్టు CM స్టాలిన్ తెలిపారు. షో సంద‌ర్భంగా వేడి సంబంధిత కార‌ణాల వల్ల ఐదుగురు మ‌ర‌ణించిన విషయం తెలిసిందే. ఊహించిన దాని కంటే పెద్ద‌సంఖ్య‌లో ప్ర‌జ‌లు రావ‌డంతో తిరుగు ప్రయాణంలో వారు ఇబ్బందులుప‌డిన‌ట్టు తెలిసింద‌న్నారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి భారీ ఈవెంట్లకు మరిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌న్నారు.