News October 13, 2025

పిల్లలుగా ఆ ఒక్కటి చేయండి చాలు!

image

నాకోసం ఏం చేశావ్? అని అడిగే పిల్లలను చూసుంటారు. కానీ, మా కోసం ఏం చేశావ్? అని అడిగే పేరెంట్స్‌ని చూసుండరు. ఎందుకంటే వాళ్లు మీ ఎదుగుదల, సంతోషం తప్ప ఏమీ కోరుకోరు. అలాంటి వారికి మీరు పట్టు పీతాంబరాలు, పంచభక్ష పరమాన్నాలు పెట్టక్కర్లేదు. 25 ఏళ్లు వచ్చాకైనా ‘నాన్న డబ్బులివ్వు’ అని చెయ్యి చాచకుండా మీ ఖర్చులకు మీరు సంపాదించుకుంటే చాలు. బాధ్యతలు తీసుకోకపోయినా భారం కాకపోతే అదే మీరిచ్చే గిఫ్ట్. ఏమంటారు?

Similar News

News October 13, 2025

వ్యాయామంతో క్యాన్సర్ చికిత్స సైడ్‌ఎఫెక్ట్స్‌కి చెక్

image

బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్‌‌లో భాగమైన రేడియోథెరపీతో పేషెంట్లు విపరీతమైన అలసటకు గురవుతారు. అయితే రెసిస్టెన్స్, ఏరోబిక్ వ్యాయామాలు చేస్తే దీన్నుంచి త్వరగా కోలుకోవచ్చని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. వ్యాయామం కారణంగా చెడు ప్రభావాలు కనిపించలేదని స్టడీ వెల్లడించింది. కాబట్టి చికిత్స తర్వాత చిన్న చిన్న వ్యాయామాలు ఎంతో ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. <<-se>>#Womenhealth<<>>

News October 13, 2025

200% టారిఫ్స్ వేస్తానని బెదిరించా: ట్రంప్

image

ఇండియా-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. ‘టారిఫ్స్‌ ఆధారంగానే నేను కొన్ని యుద్ధాలను ఆపాను. ఇండియా-పాక్ వార్ విషయంలోనూ అదే చేశాను. 100%, 150%, 200% విధిస్తానని హెచ్చరించా’ అని తెలిపారు. 24 గంటల్లోనే ముగించానని చెప్పారు. సుంకాలతో భయపెట్టకపోతే ఘర్షణలు ఆగేవి కాదన్నారు. పీస్ సమ్మిట్ కోసం ఈజిప్టుకు బయల్దేరుతూ ఆయన మీడియాతో మాట్లాడారు.

News October 13, 2025

NIEPMDలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీస్ (NIEPMD) 7 కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 23లోగా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి SSLC, డిప్లొమా , బీఎస్సీ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.590, SC, ST, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. వెబ్‌సైట్: https://niepmd.nic.in/