News October 8, 2024
JUST IN: ఆధిక్యం కోల్పోయిన వినేశ్

భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగట్ ఆధిక్యం కోల్పోయారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేశారు. కాగా ఇప్పటి వరకు ఆధిక్యం కనబరుస్తూ వచ్చిన వినేశ్ను BJP అభ్యర్థి యోగేశ్ కుమార్ వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఆయన 2,039 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
Similar News
News November 26, 2025
2 కోట్ల ఆధార్ ఐడీల తొలగింపు.. కారణమిదే!

దేశవ్యాప్తంగా 2 కోట్ల ఆధార్ ఐడీలను UIDAI డీయాక్టివేట్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డేటా క్లీనింగ్లో భాగంగా చనిపోయిన వ్యక్తుల వివరాలను డిసేబుల్ చేసినట్లు చెప్పింది. ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఇలా చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, భారత రిజిస్ట్రార్ జనరల్ నుంచి వచ్చిన డెత్ రిజిస్ట్రేషన్లు, ఇతర సమాచారం ఆధారంగా డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది.
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.


