News October 14, 2025

అలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు!

image

ఎవరికైనా ఫ్రెండ్స్ అంటే చాలామందే ఉంటారు. కానీ, బెస్ట్ ఫ్రెండ్ అనగానే ఒక్కరిద్దరు మాత్రమే ఉంటారు. మీరు నవ్వితే వాళ్లు నవ్వుతారు, మీరు ఏడిస్తే ఓదారుస్తారు, మీరు గెలిస్తే వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు, మీకు కష్టమొస్తే వాళ్లు అడ్డంగా నిలబడిపోతారు. ఎవరి లైఫ్‌లోనైనా అలాంటి ఫ్రెండ్ ఒక్కరున్నా చాలు. మీ జీవితంలో గెలిచారని చెప్పొచ్చు. మరి అలాంటి ట్రూ ఫ్రెండ్ మీ లైఫ్‌లోనూ ఉన్నారా? కామెంట్ చేయండి.

Similar News

News February 19, 2026

ఫిబ్రవరి 19: చరిత్రలో ఈరోజు

image

1473: ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ జననం
1630: మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జననం
1915: స్వాతంత్య్ర సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలే మరణం
1930: సినీ దర్శకుడు, నటుడు కె.విశ్వనాథ్ జననం
2009: తెలుగు నటి నిర్మలమ్మ మరణం
2018: హాస్యనటుడు గుండు హనుమంతరావు మరణం

News February 19, 2026

NCERT ‘ఇ-మ్యాజిక్ బాక్స్’.. AIతో ఇక సరదాగా చదువు

image

3 నుంచి 8 ఏళ్ల చిన్నారుల కోసం NCERT సరికొత్త AI ఆధారిత ‘ఇ-మ్యాజిక్ బాక్స్’ యాప్‌ను లాంచ్ చేసింది. ఇందులో కథలు చెప్పే ‘కథా సఖి’, తల్లిదండ్రుల సందేహాలు తీర్చే ‘పేరెంట్ తార’, ఉపాధ్యాయులకు బోధనలో సాయపడే ‘టీచర్ తార’ అనే 3 స్మార్ట్ బాట్‌లు ఉన్నాయి. ఆటపాటల ద్వారా పిల్లల్లో క్రియేటివిటీని పెంచడంతో పాటు వారు అడిగే ప్రశ్నలకు ఈ యాప్ వెంటనే AI సాయంతో సమాధానాలిస్తుంది.

News February 19, 2026

రూ.50Kకే మ్యాక్‌బుక్ ఎయిర్?

image

మార్చ్ 4న జరిగే కంపెనీ ఈవెంట్‌లో లోకాస్ట్ మ్యాక్‌బుక్‌ను యాపిల్ లాంఛ్ చేయనుందని సమాచారం. ప్రస్తుతం మ్యాక్ బుక్ సిరీస్ ల్యాప్‌టాప్‌లలో ఎయిర్ వర్షన్ తక్కువ ధర. అయితే అది కూడా రూ.1లక్షకు సమీపంలో ఉండగా, వచ్చే నెలలో రిలీజ్ అయ్యే డివైజ్ ధర రూ.50వేలు ఉండొచ్చని టెక్ లీక్స్ చెబుతున్నాయి. ఇందులో A18 చిప్, ai సహా పలు ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఇక ఇదే ఈవెంట్‌లో 17e మొబైల్‌నూ యాపిల్ రిలీజ్ చేయనుంది.