News August 3, 2024
వర్గీకరణ అప్పుడే అమలు చేయండి: వెంకన్న

TG: అన్ని కులాల జనాభా లెక్కలు తేల్చిన తర్వాతే వర్గీకరణ అమలు చేయాలని MLC గోరటి వెంకన్న ప్రభుత్వాన్ని కోరారు. సామాజికంగా మాదిగ వర్గానికి రావాల్సిన హక్కులు అందాల్సిందేనని స్పష్టం చేశారు. ‘ఎస్సీలపై దాడులు జరిగినప్పుడు గొంతెత్తని వారు ఇప్పుడు మా వర్గీకరణ విషయంలో ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విభేదాల కోసమా? మాదిగలు, మాలలు ఐక్యంగా రాజకీయాల్లో జనాభా ప్రాతిపదికన ఉమ్మడి వాటా తీసుకోవాలి’ అని ఆయన సూచించారు.
Similar News
News November 18, 2025
మావోలకు మరో 4 నెలలే గడువు: బండి

TG: అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. హిడ్మా హతం సందర్భంగా ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడారు. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామని, మరో 4 నెలలే ఉన్నందున నక్సల్స్ లొంగిపోవాలని పిలుపునిచ్చారు. బుల్లెట్‌ను కాకుండా బ్యాలెట్‌ను నమ్ముకోవాలని సూచించారు. కేవలం పోలీసులు, సైనికుల చేతుల్లోనే తుపాకులు ఉండాలన్నారు.

PGIMERలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (<