News January 3, 2025
NTR, KCR వల్లే బీసీలకు న్యాయం: కవిత

TG: కాంగ్రెస్ పాలనలో BCలకు ఎప్పుడూ అన్యాయమే జరిగిందని BRS MLC కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇది అబద్ధమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన బీసీ మహా సభలో ఆమె మాట్లాడారు. ‘నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. బీజేపీ సర్కార్ కూడా బీసీలకు చేసిందేమీ లేదు. ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమే వారికి న్యాయం చేశారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Similar News
News November 14, 2025
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్లాన్ ఫెయిల్.. డిపాజిట్లు గల్లంతు

పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిశోర్కు మంచి పేరుంది. ఎన్నికలు ఏవైనా ఆయన ప్లాన్ చేస్తే ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందనే టాక్ ఉండేది. అయితే ఆ వ్యూహాలు తాను స్థాపించిన జన్ సురాజ్ పార్టీని అధికార పీఠం దగ్గరకు కూడా తీసుకొని వెళ్లలేకపోయాయి. బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మొత్తం 239 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2% ఓటు షేర్ మాత్రమే జన్ సురాజ్కు దక్కింది.
News November 14, 2025
తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే?

జుట్టు నల్లగా ఉండటానికి కారణమయ్యే మెలనోసైట్లు తగ్గటానికి విటమిన్ డి లోపం, మానసిక ఒత్తిడి, సిగరెట్లు తాగటం, ఇతరులు కాల్చిన సిగరెట్ల పొగ పీల్చటం, వాయు కాలుష్యం, నిద్రలేమి, షిఫ్ట్ ఉద్యోగాలు వంటివి కారణమవుతాయంటున్నారు నిపుణులు. రాత్రిపూట కంటి నిండా నిద్రపోతే మెలటోనిన్ బాగా తయారవుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే జుట్టు తెల్లబడటాన్ని ఆపొచ్చు. మరీ అవసరమైతే వైద్యుల సూచనతో సప్లిమెంట్లు వాడొచ్చు.
News November 14, 2025
BRS ఓటమి.. కవిత సంచలన ట్వీట్

TG: జూబ్లీహిల్స్లో BRS ఓటమి వేళ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ దండం పెట్టే ఎమోజీలతో ట్వీట్ చేశారు. దీంతో ‘కవితక్కతో ఏమీ కాదు అని హేళన చేసిన వారికి ఈ ఫలితం చెంపపెట్టు’ అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల BRS నుంచి బయటికి వచ్చిన కవిత కేసీఆర్ మినహా మిగతా నేతలపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.


