News August 15, 2024

ఆ 3 క్రిమినల్ చట్టాలతో ప్రజలకు న్యాయం: PM మోదీ

image

ఈ ఏడాది జులైలో ప్రభుత్వం తీసుకొచ్చిన 3 క్రిమినల్ చట్టాలతో అందరికీ న్యాయం జరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శిక్ష కంటే న్యాయానికే తమ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చిందని తెలిపారు. బ్రిటిష్ కాలానికి చెందిన ఐపీసీ, సీఆర్‌పీసీ, ఐఈఏల స్థానంలో భారతీయ న్యాయ సంహిత(BNS), భారతీయ నాగరిక సురక్ష సంహిత(BNSS), భారతీయ సాక్ష్య అధినియం(BSA) చట్టాల్ని కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News November 10, 2025

ఆర్థిక మోసానికి గురయ్యారా? ఇలా ఫిర్యాదు చేయండి

image

ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు Sachet పోర్టల్‌ను RBI ప్రారంభించింది. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న సంస్థలు/వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి దీనిని రూపొందించారు. మీరు మోసపోయినట్లయితే <>sachet.rbi.org.in<<>> పోర్టల్‌లో సంస్థ పేరు, అడ్రస్, మోసం వివరాలు వంటి పూర్తి సమాచారాన్ని అందించి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును బట్టి పోలీసులకు లేదా దర్యాప్తు సంస్థలకు పంపుతారు.

News November 10, 2025

మెడికల్ విద్య కోసం ఇప్పుడు జార్జియా వైపు!

image

భారత్ నుంచి అనేకమంది వైద్యవిద్య కోసం గతంలో ఉక్రెయిన్‌కు వెళ్లేవారు. రష్యాతో యుద్ధంతో ఇప్పుడు జార్జియా వైపు మళ్లుతున్నారు. RBI ప్రకారం అక్కడ ఈ చదువు కోసం 2018-19లో $10.33M వెచ్చించగా 2024-25లో అది $50.25Mలకు పెరిగింది. కాగా వారు ఇండియా వచ్చాక NExT/FMGE పాస్ కావాలి. జార్జియా నుంచి వచ్చే వారిలో 35% మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. అక్కడి వర్సిటీల గురించి ముందే తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News November 10, 2025

PM కిసాన్ లిస్టులో మీ పేరు లేదా? కారణమిదే!

image

PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి లక్షలాది మంది లబ్ధిదారులను తొలగించారన్న ప్రచారంపై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘గైడ్‌లైన్స్ ప్రకారం 2019 FEB 1 తర్వాత భూమి కొన్న వారికి ఈ స్కీమ్ వర్తించదు. ఒకే ఫ్యామిలీ నుంచి భర్త, భార్య, పిల్లలు వేర్వేరుగా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించాం. అలాంటి వారికి తాత్కాలికంగా నిలిపివేశాం. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అర్హులని తేలితే మళ్లీ జాబితాలో చేర్చుతాం’ అని పేర్కొంది.