News May 7, 2024

తెలంగాణకో న్యాయం.. ఏపీకో న్యాయమా: సజ్జల

image

ఏపీలో పథకాల నిలుపుదల సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీని వెనుక ఎవరున్నారో తెలుసన్నారు. తెలంగాణలో రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చేందుకు ఈసీ అంగీకరించిందని దుయ్యబట్టారు. నిధుల విడుదలలో తెలంగాణకో న్యాయం.. ఏపీకో న్యాయమా అని ప్రశ్నించారు.

Similar News

News January 1, 2025

2025: తొలిరోజు స్టాక్‌మార్కెట్లు ఎలా ట్రేడవుతున్నాయంటే..

image

కొత్త ఏడాది తొలిరోజు దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెలవు కావడంతో ఆసియా మార్కెట్ల నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 78,033 (-110), నిఫ్టీ 23,597 (-50) వద్ద చలిస్తున్నాయి. మీడియా మినహా అన్ని రంగాల షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. APOLLOHOSP, LT, ASIANPAINT, INFY, BRITANNIA టాప్ గెయినర్స్. BAJAJ AUTO, ADANI PORTS టాప్ లూజర్స్.

News January 1, 2025

దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని విషెస్

image

నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. అటు మిగతా ప్రజాప్రతినిధులూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నారు.

News January 1, 2025

విశ్వ వేదికపై విజయ గీతికగా TG ప్రస్థానం ఉండాలి: CM

image

TG: రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘నవ వసంతంలో విశ్వ వేదికపై విజయ గీతికగా తెలంగాణ స్థానం, ప్రస్థానం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ నూతన సంవత్సరం శుభ సంతోషాలను నింపాలని మనసారా కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి,రజినీకాంత్, కమల్ హాసన్, ఎన్టీఆర్ తదితరులు కూడా X వేదికగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు.