News August 6, 2024

గాజా పౌరులను ఆకలితో చంపడమే న్యాయం: ఇజ్రాయెల్ మంత్రి

image

గాజాపై ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ‘హమాస్ మా పౌరులందరినీ వదలకపోతే గాజాలో ఉన్న 20లక్షలమందిని ఆకలితో మాడ్చి చంపడమే న్యాయంగా అనిపిస్తోంది. దురదృష్టవశాత్తూ ప్రపంచం గాజాకు ఏం కానివ్వదు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి నరమేధానికి పాల్పడితే మిత్రదేశాలు కూడా ఇజ్రాయెల్‌తో ఉండవంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News December 27, 2025

జరీబు భూములపై పరిశీలనకు ఆదేశం

image

AP: రాజధాని ప్రాంతంలోని జరీబు(3 పంటలు పండేవి) భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వర్గీకరణపై పున:పరిశీలనకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. జరీబు, నాన్ జరీబు భూములు ఇచ్చినవారికి ప్లాట్లు ఇస్తున్నామని, ఈ ప్రక్రియ 45రోజుల్లో పూర్తి చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

News December 27, 2025

పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌కు దీంతో చెక్

image

కొందరు మహిళలు డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు లోనవుతుంటారు. దీనివల్ల తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదమే అంటున్నారు నిపుణులు. అయితే డెలివరీ తర్వాత డిప్రెషన్ రాకుండా తక్కువ మోతాదులో ఎస్కెటమైన్‌ ఇంజెక్షన్‌ ఇస్తే ఫలితం ఉంటుందంటున్నారు. డిప్రెషన్‌కు వాడే కెటమైన్‌ అనే మందు నుంచే ఎస్కెటమైన్‌ను తయారు చేస్తారు. పరిశోధనల్లో ఇది సుమారు 75% వరకూ డిప్రెషన్ లక్షణాలు రాకుండా చూసినట్లు పరిశోధకులు వెల్లడించారు.

News December 27, 2025

H-1B ఆంక్షలు.. ఇండియాకు జాబ్ లక్!

image

H-1B వీసా నిబంధనల్ని US కఠినం చేయడం ఒకరకంగా మనకు కలిసొచ్చింది. అక్కడ ఫీజులు, భారీ వేతనాల నేపథ్యంలో బడా టెక్ కంపెనీలు ఇండియాలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ ఏడాది పలు సంస్థలు భారత్‌లో 32,000 మందికి కీలక రంగాల్లో ఉద్యోగాలిచ్చాయి. వీసా గోల లేకపోవడం, తక్కువ ఖర్చు కలిసొచ్చింది. అమెరికా ఆంక్షలు అక్కడ నిరుద్యోగాన్ని పెంచి మన IT రంగానికి ఊపిరి పోస్తున్నాయి.