News November 25, 2024

అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పీసీఘోష్ కమిషన్

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా జస్టిస్ పీసీఘోష్ కమిషన్ మేడిగడ్డ ఏఈఈ, డీఈలను విచారించింది. నిర్మాణం, పనుల వివరాలపై ఆరా తీసింది. క్షేత్రస్థాయి పనుల రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న కమిషన్, పనులపై ప్లేస్‌మెంట్ రికార్డులను అడిగి తెలుసుకుంది. ప్రాజెక్టు DPR, అనుమతులు సహా పలు అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం.

Similar News

News November 25, 2024

సీజ్‌ఫైర్‌కు అంగీక‌రించిన ఇజ్రాయెల్‌!

image

లెబ‌నాన్‌లో తాత్కాలికంగా కాల్పుల విర‌మ‌ణ‌కు ఇజ్రాయెల్‌ అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రో 2 రోజుల్లో దీనిపై ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. ఈ ఒప్పందం మేర‌కు హెజ్బొల్లా త‌న బ‌ల‌గాల‌ను లిటాని న‌దికి ఉత్త‌రంగా త‌రలించాలి. ద‌క్షిణ లెబ‌నాన్ నుంచి ఇజ్రాయెల్ ద‌ళాలను ఉప‌సంహ‌రించుకోవాలి. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల విభజనపై ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య చర్చలు జ‌రుగుతాయి. ఈ ఒప్పందం అమ‌లును అమెరికా ప‌ర్య‌వేక్షిస్తుంది.

News November 25, 2024

ఢిల్లీకి ‘మహా’ రాజకీయం

image

మహారాష్ట్ర సీఎం ఎవరనేది ఈ రాత్రికి క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. దేవేంద్ర ఫడణవీస్ ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్ కూడా వెళ్లనున్నారు. వీరు ముగ్గురు బీజేపీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. అందులో సీఎం క్యాండిడేట్‌ను నిర్ణయించనున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

News November 25, 2024

CM చంద్రబాబుకు షర్మిల లేఖ

image

AP: CM చంద్రబాబుకు PCC చీఫ్ షర్మిల లేఖ రాశారు. అదానీతో జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందం APకి పెనుభారమని లేఖలో ఆమె పేర్కొన్నారు. అక్రమ డీల్ వల్ల పాతికేళ్ల పాటు ప్రజలపై రూ.లక్షన్నర కోట్ల భారం పడుతుందని ఆమె ఆరోపించారు. అర్ధరాత్రి అనుమతులు ఎందుకు ఇచ్చారనే దానిపై దర్యాప్తు జరగాలని, ఈ ఒప్పందాలపై CBI లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు.