News October 24, 2024
తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. నవంబర్ 11న జస్టిస్ ఖన్నా సీజేఐగా ప్రమాణం చేస్తారు. జస్టిస్ ఖన్నా పేరును ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. నవంబర్ 10న జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు.
Similar News
News January 24, 2026
కీలక మీటింగ్కు గైర్హాజరు.. స్పందించిన శశి థరూర్

కాంగ్రెస్ కీలక సమావేశానికి గైర్హాజరుపై వస్తున్న వార్తలను ఆ పార్టీ MP శశి థరూర్ తోసిపుచ్చారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగ వేదికలపై చర్చించబోనన్నారు. ‘రాజకీయ ప్రకటనలు చేయడానికి రాలేదు. సొంత పార్టీ నాయకులతో చర్చించాల్సిన సమస్యలపై పబ్లిక్లో మాట్లాడను. పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లినప్పుడు పార్టీ నాయకులతో మాట్లాడే ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నాను’ అని కేరళ సాహిత్య ఉత్సవంలో చెప్పారు.
News January 24, 2026
CCMBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్లోని <
News January 24, 2026
క్రెడిట్ చోరీయా… జగన్కు ఏం క్రెడిట్ ఉంది: CBN

AP: జగన్ చేసిన పనుల్ని ప్రజలు మరిచిపోతే మళ్లీ వినాశనమే అని CM CBN హెచ్చరించారు. ‘తన మనుషుల్ని పెట్టుకొని ల్యాండ్ టైటిలింగ్తో భూమి కాజేసే ప్రయత్నం చేశారు. చివరకు దేవునికిచ్చిన నెయ్యినీ కల్తీ చేశారు. రాక్షసపాలన సాగించారు. తప్పుడు కేసుతో నన్ను జైల్లో పెట్టారు. ఇప్పుడు అమరావతిని అడ్డుకుంటున్నారు. నేను క్రెడిట్ చోరీ చేశానంటున్నారు. ఆయనకేం క్రెడిట్ ఉంది. ఇలాంటి వారిపట్ల జాగ్రత్త’ అని సూచించారు.


