News March 9, 2025

నాగార్జునతో ఆ సీన్లకు నో చెప్పిన జ్యోతిక.. ఎందుకో తెలుసా?

image

నాగార్జున-జ్యోతిక కాంబినేషన్‌లో వచ్చిన ‘మాస్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నటించాలంటే ముద్దులు, రొమాన్స్‌ సీన్‌లు ఏవీ ఉండకూడదని డైరెక్టర్ లారెన్స్‌కు జ్యోతిక కండీషన్ పెట్టిందట. దీనికి ఓకే చెప్పడంతోనే ఈ మూవీలో నటించిందట. అప్పటికే జ్యోతిక సూర్యతో ప్రేమలో ఉండటంతో ఈ సీన్లకు నో చెప్పిందని టాక్.

Similar News

News October 20, 2025

దీపావళి రోజున దివ్వెలు ఎందుకు వెలిగించాలి?

image

దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం. సకల దేవతల నివాసం. దీపం వెలిగించిన చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అందుకే దీపం లేని ఇల్లు కళావిహీనమవుతుంది. దీపారాధన లేకుండా దీపావళి చేయరు. దీపపు కుందిలో బ్రహ్మ, విష్ణుమూర్తి ఉంటారు. ఈ వెలుగుల పండుగ రోజున వారే స్వయంగా ఇంట్లో వెలుగు నింపుతారు. దీపం సమస్త దేవతా స్వరూపం కాబట్టే వారిని ఆహ్వానించి, అనుగ్రహం పొందడానికి దీపావళి నాడు దీపాలు వెలిగించాలి.

News October 20, 2025

దీపావళి: ఇవాళ ఏం చేయాలి?

image

హిందువులకు ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఇవాళ ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి సాయంకాలం దీపాలతో అలంకరించాలి. కుటుంబసభ్యులతో కలిసి లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసిన మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి. దుస్తులు, స్వీట్లు లేదా ఆహారపదార్థాలను దానం చేయాలి. ఆసక్తి ఉంటే రాత్రి వేళలో <<18052455>>జాగ్రత్తలు<<>> పాటిస్తూ టపాసులు కాల్చాలి.

News October 20, 2025

దీపావళి రోజన పిల్లిని పూజించే ఆచారం..

image

దీపావళిని మనం అజ్ఞానాన్ని తొలగించే దివ్య దీపాల పండుగ్గా జరుపుకొంటాం. కానీ అపశకునంగా భావించే పిల్లిని లక్ష్మీదేవిగా కొలిచి పూజించే సంప్రదాయం రాజస్థాన్‌లో ఉంది. దీపావళి పర్వదినాన అక్కడి మహిళలు మార్జాలానికి నైవేద్యం సమర్పిస్తారు. కర్ణాటకలోనూ ఈ ఆచారం ఉంది. ఆ రోజు తమ నగలను స్త్రీలు నదిలో శుభ్రం చేసి, అన్ని రకాల పిండి వంటలు వండి, పిల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఫలితంగా మంచి జరుగుతుందని నమ్ముతారు.