News February 3, 2025
కచిడి చేప@3.95 లక్షలు
AP: కాకినాడ వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను అదృష్టం వరించింది. అరుదైన కచిడి చేప వారికి కాసులు కురిపించింది. 25KGల చేప వేలంలో రూ.3.95 లక్షలు పలికింది. దీని శాస్త్రీయ నామం ప్రొటోనిబియా డయాకాన్తస్. కుట్లు వేసేందుకు వాడే దారాన్ని ఈ చేప పొట్ట భాగం నుంచే తయారు చేస్తారు. సౌందర్య సాధనాల తయారీలో వినియోగిస్తారు. ఖరీదైన వైన్లను శుభ్రం చేయడానికి ఈ చేప రెక్కలను వాడతారు. అందుకే ఈ ఫిష్‌కు డిమాండ్.
Similar News
News February 3, 2025
ప్రభుత్వ స్కూళ్లలో తగ్గుతున్న అడ్మిషన్లు.. సర్కార్ కీలక నిర్ణయం
TG: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ విద్యాసంస్థల్లో అందిస్తున్న సౌకర్యాలు, వస్తున్న ఫలితాల గురించి ప్రజలకు తెలిసేలా వివరించనుంది. అడ్మిషన్లు పెరిగేలా చర్యలు చేపట్టనుంది. దీనికోసం FB, X, WHATSAPP వంటి సోషల్ మీడియా వేదికల్లో స్పెషల్ గ్రూపులను క్రియేట్ చేయనుంది. వీటిని స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారని సమాచారం.
News February 3, 2025
ఆత్మీయ భరోసా.. నిలిచిపోయిన డబ్బుల జమ?
TG: MLC ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ కారణంగా ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ డబ్బుల జమ నిలిచిపోయినట్లు సమాచారం. తొలి విడతలో 18,180 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ₹10.90crకు పైగా ప్రభుత్వం జమ చేసింది. ఈ స్కీమ్‌కు 5.80L మందిని ఇప్పటికే అర్హులుగా గుర్తించింది. కొత్త దరఖాస్తులను పరిశీలిస్తోంది. కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా ఆ ఫ్యామిలీలోని వారిని అనర్హులుగా గుర్తిస్తున్నట్లు సమాచారం.
News February 3, 2025
TTD UPDATE: తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లు
రేపు రథ సప్తమి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అష్టాదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు, ఊంజల్ సేవల్ని టీటీడీ రద్దు చేసింది. అటు ఎన్ఆర్ఐలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు కేటాయించే ప్రత్యేక దర్శనాలను, నేటి నుంచి 3రోజుల వరకూ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసింది. నేడు సిఫార్సు లేఖల్ని స్వీకరించబోమని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి.