News April 2, 2025

రాష్ట్రంలోనే క్లీన్ ఎయిర్ సిటీగా కడప

image

AP: రాష్ట్రంలో అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా కడప నిలిచినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక్కడ 10 పీఎం స్థాయిలో 42 పాయింట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత 52 పాయింట్లతో నెల్లూరు రెండో స్థానంలో ఉండగా కర్నూలు, ఒంగోలు (56 ) మూడో స్థానంలో నిలిచాయి. అత్యంత కాలుష్య నగరంగా విశాఖపట్నం (120) నిలిచింది. అమరావతిలో ఎలాంటి పరిశ్రమలు, నిర్మాణాలు లేకపోయినా కాలుష్యం 71 పాయింట్లుగా నమోదైంది.

Similar News

News April 3, 2025

ట్రెండింగ్‌లో ‘వింటేజ్ ఆర్సీబీ’

image

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో ఓడిపోవడంతో ఆర్సీబీపై నెటిజన్లు SM వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. తొలి రెండు మ్యాచుల్లో విజయం గాలివాటమేనని కామెంట్లు చేస్తున్నారు. మూడో మ్యాచులో పరాజయంతో ‘వింటేజ్ ఆర్సీబీ’ తిరిగి వచ్చేసిందని ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఈ ఒక్క పరాజయంతో తమ జట్టును తక్కువగా అంచనా వేయొద్దని, ఈ సారి కప్పు కొడతామని ఆర్సీబీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News April 3, 2025

వక్ఫ్ బిల్లులోని కీలకాంశాలు..

image

* వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ముస్లింలే ఉంటారు. కనీసం ఇద్దరు మహిళలకు చోటు కల్పించాలి.
* వక్ఫ్ కౌన్సిల్‌, రాష్ట్ర బోర్డుల్లో ఇద్దరు ముస్లిమేతరులను నియమించాలి.
* కొత్త చట్టం అమల్లోకొచ్చిన 6 నెలల్లో ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ డేటా‌బేస్‌లో చేర్చాలి.
* వక్ఫ్ ట్రైబ్యునల్ తీర్పులను 90రోజుల్లో హైకోర్టులో సవాలు చేసుకోవచ్చు.
* ఈ ట్రైబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఉండాలి.

News April 3, 2025

ఆరెంజ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్లు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఉమ్మడి కరీంనగర్, HYD, MBNR, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

error: Content is protected !!