News March 17, 2024

కడప: పోటీకి సిద్ధం.. మరి గెలుపు ఎవరది?

image

ఉమ్మడి కడప జిల్లాలో అభ్యర్థుల ఖరారుతో ఎన్నికల సమరానికి పార్టీలు సిద్ధమయ్యాయి. టీడీపీ 6 స్థానాలను ఇప్పటికే ప్రకటించగా, వైసీపీ శనివారం అభ్యర్థులను ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా పూర్తి స్పష్టత వచ్చింది. ఇక ఎన్నికల ప్రచారమే తరువాయి. బద్వేలు, రాజంపేట, కోడూరు, జమ్మలమడుగు స్థానాల్లో TDPతో పొత్తులో ఉన్న జనసేన, బీజేపీకి ఏ సీట్లు వెళ్తాయో చూడాలి. ఏదేమైనా జిల్లాలో పూర్తి స్పష్టతతో పార్టీలు దూసుకుపోతున్నాయి.

Similar News

News March 11, 2026

కడప జిల్లాలో వంట గ్యాస్ కనెక్షన్లు ఎన్నంటే.!

image

కడప జిల్లాలో గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 5,99,802 ఉన్నాయి. ప్రభుత్వం వీటి రీఫిల్ ధరను రూ.60 పెంచింది. దీంతో జిల్లాలోని కుటుంబాలపై ఒక సిలిండర్ వినియోగానికి రూ.3.59 కోట్లు అదనపు భారం పడింది. జిల్లాలో వాణిజ్య వంట గ్యాస్ కనెక్షన్లు 4,769 ఉన్నాయి. వీటిపై రీఫిల్ ధరను రూ.144 పెంచారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా చిన్న హోటళ్లు, పానిపూరీ, టీ స్టాళ్లలో డొమస్టిక్ గ్యాస్ వాడుతున్నారు.

News March 11, 2026

ఒంటిమిట్ట: మార్చి 25న పసుపు దంచే కార్యక్రమం

image

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 25న ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 27న ప్రారంభం కానున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1వ తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ పసుపును వినియోగించనున్నారు. ఈ కార్యక్రమంలో మహిళల అధిక సంఖ్యలో పాల్గొంటారు.

News March 11, 2026

వైవీయూ విద్యార్థి రేగులపాటి పునీత్ చిత్రానికి అవార్డ్

image

వైవీయు బీఎఫ్‌ఏ విద్యార్థి రేగులపాటి పునీత్ మెరిట్ అవార్డ్ సాధించారు. తమిళనాడులోని శ్రీ దర్శినికలై కోడం ఆర్ట్ కాలేజీ నిర్వహించిన 21వ జాతీయ స్థాయి చిత్రకళా పోటీలలో పునీత్ ఆక్రిలిక్ రంగుతో గీసిన “గ్రామీణ మహిళ “ చిత్రం ఎంపికయ్యింది. ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు చెన్నై లలితకళా అకాడమీ ఆర్ట్ గ్యాలరీలో చిత్రాన్ని ప్రదర్శిస్తారని ఫైన్ ఆర్ట్స్ హెడ్ మృత్యుంజయ రావు తెలిపారు.