News April 1, 2024
బీఆర్ఎస్‌కు కడియం ద్రోహం చేశారు: హరీశ్
TG: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై BRS ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రవ్యాఖ్యలు చేశారు. నైతిక విలువలు ఉంటే పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని విమర్శించి ఆయనతోనే జట్టు కట్టారని దుయ్యబట్టారు. రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనం అవసరమా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌కు కడియం ద్రోహం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
Similar News
News November 7, 2024
దశలవారీగా సర్పంచుల బాకీలు చెల్లిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
TG: సర్పంచుల బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. BRS నేతల రెచ్చగొట్టే మాటలు ఎవరూ నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. సర్పంచులకు చెందాల్సిన నిధులను BRS ప్రభుత్వం దారి మళ్లించలేదా? 60 మంది సర్పంచుల ఆత్మహత్యలకు కారణం కాలేదా? అని మంత్రి ప్రశ్నించారు. గత ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు చెల్లించలేదని ఆయన అన్నారు.
News November 7, 2024
శీతాకాలంలో శరీర రక్షణకు ఇవి అవసరం
శీతాకాలం వచ్చేసింది. అనేక ఆరోగ్య సమస్యలు శరీరంపై దాడి చేస్తాయి. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు విటమిన్ సీ, విటమిన్ డీ, జింక్, విటమిన్ ఏ, విటమిన్ ఈ, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, బి విటమిన్స్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలు, పండ్లు, పాల పదార్థాలు, చేపలు, గుడ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి సమృద్ధిగా తీసుకోవాలని పేర్కొంటున్నారు.
News November 7, 2024
బెల్టుషాపులపై మంత్రి కీలక ఆదేశాలు
AP: ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టుషాపులను ఉపేక్షించవద్దని ఆదేశించారు. తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష తప్పదనే సంకేతాలు ఇవ్వాలని సూచించారు. కల్తీ మద్యం రహిత రాష్ట్రంగా ఏపీని మారుద్దామని పిలుపునిచ్చారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించాలని సూచించారు.