News March 29, 2024
ఢిల్లీకి చేరుకున్న కడియం శ్రీహరి

TS: కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 9గంటలకు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని వారిద్దరూ కలవనున్నట్లు తెలుస్తోంది. తాను వరంగల్ బరి నుంచి తప్పుకొంటున్నట్లు కావ్య కేసీఆర్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తనను మన్నించాలంటూ ఆమె అందులో కోరారు. నేడు శ్రీహరి, కావ్య అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకొనే అవకాశం ఉంది.
Similar News
News December 6, 2025
‘మహానటి’ నుంచి ఈతరం ఏం నేర్చుకోవాలంటే?

మహానటి సావిత్రి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎంత స్టార్డమ్ వచ్చినా మూలాలను మర్చిపోకుండా సాధారణ నటిగానే మెలిగారు. ప్రత్యేక ఏర్పాట్లు, సెపరేట్ స్టాఫ్, అనవసరపు ఖర్చులతో ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టలేదు. జూనియర్ ఆర్టిస్టులతో కలివిడిగా ఉండేవారు. యూనిట్ సభ్యులను బాగా చూసుకునే వారు. క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. ఇవాళ సావిత్రి 90వ జయంతి.
News December 6, 2025
మే 17న JEE అడ్వాన్స్డ్

JEE అడ్వాన్స్డ్-2026 తేదీని IIT రూర్కీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా మే 17న నిర్వహించనున్నట్లు తెలిపింది. 9AM నుంచి 12PM వరకు పేపర్-1, 2.30PM నుంచి 5.30PM వరకు పేపర్-2 ఉంటాయని వెల్లడించింది. పూర్తి షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. JEE మెయిన్లో టాప్ 2.5 లక్షల ర్యాంకుల్లో నిలిచిన విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హులు. JEE మెయిన్ సెషన్-1 జనవరిలో, సెషన్-2 ఏప్రిల్లో జరగనున్నాయి.
News December 6, 2025
ఉల్లి పండిన నేలలో మల్లీ పూస్తుంది..

ఉల్లి సాగు సాధారణంగా శ్రమతో కూడుకున్నది. కొన్నిసార్లు కన్నీళ్లతో (ఉల్లి కోసేటప్పుడు) ముడిపడి ఉంటుంది. అలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్న నేలలో కూడా మంచి సస్యరక్షణ చేపడితే మల్లె వంటి సువాసనగల, అందమైన పంట పెరుగుతుంది. అలాగే జీవితంలో కూడా కష్టాలతో కూడిన ఒక దశ ముగిసిన తర్వాత, అందమైన, సంతోషంతో కూడిన దశ ప్రారంభమవుతుందని, అంతా అయిపోయిన చోటు నుంచే కొత్త ఆశలు చిగురిస్తాయని ఈ సామెత అర్థం.


