News March 18, 2024

రేపటి నుంచి కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

image

కదిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 19న ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మార్చి 19న అంకురార్పణం ఉత్సవం, 20న కళ్యాణోత్సవం, 21న హంస వాహనం, 22న సింహ వాహనం, 23న హనుమంత వాహనం, 24న బ్రహ్మ గరుడ సేవ, 25న శేష వాహనం జరగనున్నాయి. ఇది తమిళనాడులోని ఆండాల్‌ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథోత్సవం, తంజావూరు జిల్లాలోని తిరువార్‌ రథోత్సవం తర్వాత మూడో అతి పెద్ద బ్రహ్మ రథోత్సవం కానున్నది.

Similar News

News September 3, 2025

జిల్లాలో బీడు భూములు ఉండకూడదు: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో బీడు భూములు ఉండకూడదని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో అధికారులతో మాట్లాడారు. బీడు భూమిలో ఉద్యాన పంటలు, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ ఉండాలని చెప్పారు. ఏడు నియోజకవర్గాలలోని ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొత్తగా ఎంపిక చేసిన గ్రామాలకు వార్షిక కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.

News September 2, 2025

స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రైమరీ సెక్టార్ శాఖలు పనిచేయాలి: కలెక్టర్

image

స్వయం సహాయక సభ్యులు, రైతు సంఘాల సభ్యులకు సుస్థిరమైన జీవనోపాధి, స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రైమరీ సెక్టార్ శాఖల అధికారులు పని చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురంలో సంబంధిత అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలన్నారు. లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 2, 2025

రాయదుర్గం: మద్యం మత్తులో ప్యాంటు లేకుండా ఉద్యోగి

image

రాయదుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియాలజీ డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్న మధన్ మద్యం తాగి ఆసుపత్రిలోనే నిద్రించాడు. ఈ ఘటన చర్చనీయాంశమైంది. రోగులకు సేవలు అందించాల్సిన సమయంలో ఆఫీస్ వేళల్లోనే మద్యం తాగి ప్యాంటు లేకుండా బెడ్‌పై పడుకొని విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మధన్‌పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ ఆవుల మనోహర్ డిమాండ్ చేశారు.